మూసీ జలాలు వద్దు కృష్ణ జలాలే ముద్దు రైతుల నినాదాలు…

నల్గొండ జిల్లా సర్వేలు గ్రామంలో శ్రీ ఆందోళ మైసమ్మ జలసాధన సమితి సభ్యులు ఏర్పాటు చేసిన గుడిమల్కాపురం కోతులాపురం అల్లం దేవి చెరువు సర్వేలు లింగ వారి గూడెం మల్లారెడ్డిగూడెం గుజ్జ గ్రామ రైతులు సమావేశానికి హాజరై మూసీ జలాలు వద్దు కృష్ణ జలాలే ముద్దు అని నినదించి అడుగుతూ చర్లగూడెం రిజర్వాయర్ వెంటనే పూర్తి చేసి ఈ మండల రైతులందరికీ సాగునీరు అందించాలని దానికోసం రైతుల అందరం కూడా కలిసికట్టుగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమం చేద్దామని కోరారు మూసి జలాలు తీసుకువచ్చి మన చెరువులు నింపుదామని కొంతమంది నాయకులు రైతుల పేరు చెప్పుకొని ప్రజలకు రైతులకు విష జలాలు తేవడానికి వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం నారాయణపురం మండలం కరువు ప్రాంతం అయినందున ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే స్పందించి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే ప్రారంభించి మండల ప్రజలకు సాగు జనాలు అందించాలని కోరారు ఈ ప్రాంతం ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నందున ఈ ప్రజలు దాంతోనే ఇబ్బంది పడుతుంటే ఈ మూసి జలాలు తెచ్చి ఇంకా ప్రజలకు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు.