గొడవలు పడి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే కొందరు భయపడుతుంటారు. ఎక్కడైనా గొడవ పడుతున్నట్లు సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్లి గొడవను ఆపుతారని ఇప్పటి వరకు మనకు తెలుసు…కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.. ఏకంగా ఇక్కడ ముస్లింలు గుంపుగా వచ్చి పోలీసు స్టేషన్‌పై దాడికి దిగారు. ఈ సంచలన సంఘటన శుక్రవారం రాత్రి గుజరాత్లో గోద్రా బిడివిజన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం..
17 మంది అరెస్ట్.. 88 మందిపై ఎఫ్ఐఆర్
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌తో రెచ్చిపోయిన ఒక ముస్లిం గుంపు స్టేషన్, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వింది. వీళ్ల దాడి కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో, పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ దాడిలో అనేక పోలీసు వాహనాలు దెబ్బతినడంతో పాటు, అవుట్‌పోస్ట్ నంబర్ 4పై కూడా దాడి జరిగింది. శనివారం ఉదయం నాటికి దాడికి పాల్పడిన 17 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అలాగే 88 మందిపై కేసు నమోదు చేశామన్నారు. మిగిలిన నిందితుల కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరేష్ దుధత్ మాట్లాడుతూ.. గోద్రాలో భారీ పోలీసు బలగాలను మోహరించామని, ఇప్పుడు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉందని, అయితే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.