నల్గొండ జిల్లా….
నకరికల్లు నియోజకవర్గం…
నకిరేకల్ లో దారుణం – ఆస్తి కోసం కూతురిపై తండ్రి గొడ్డలితో దాడి…..
నకిరేకల్ డాక్టర్స్ కాలనీలో టైలరింగ్ షాపులో ఉన్న రాగం స్వప్నపై ఆమె తండ్రి అయినాల లింగయ్య గొడ్డలితో దాడి చేశాడు. శివాజీ నగర్ లోని ఇంటిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, నిన్న సాయంత్రం షాపులోకి వచ్చి కుడి తొడపై, ఎడమ చేతిపై వేటు వేశాడు. తీవ్ర గాయాలతో స్వప్నను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు..