– విశ్వకర్మల అభివృద్ధే లక్ష్యం.- నల్లగొండ జిల్లా విశ్వకర్మ మనుమయ సంఘం ఉపాధ్యక్షులు గా సోనగంటి గోవర్ధనాచారి నియామకం – సోనగంటి గోవర్ధనాచారి
– నల్లగొండ జిల్లా విశ్వకర్మ మనుమయ సంఘం ఉపాధ్యక్షులు
చింతపల్లి………..
విశ్వకర్మల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహాకరించాలని నల్లగొండ జిల్లా విశ్వకర్మ మనుమయ సంఘం ఉపాధ్యక్షులు సోనగంటి గోవర్ధనాచారి అన్నారు.హైదరాబాద్ లోని విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, గౌరవ అధ్యక్షులు కాసోజు విశ్వనాథచారి తీదేడు గ్రామానికి చెందిన సోనగంటి గోవర్ధనాచారి ని నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోని నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం సోనగంటి గోవర్ధనాచారి మాట్లాడుతూ… విశ్వకర్మల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విశ్వకర్మల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.నా ఎన్నికకు సహాకరించిన నల్లగొండ జిల్లా అధ్యక్షులు చొల్లెటి రమేష్ కి, కార్యదర్శి వెంకటాచారి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.