నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్..!

ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో రాష్ట్రమంతా కూటమి ప్రభంజనం సృష్టించింది. కానీ ఒకచోట మాత్రం వైఎస్సార్ సీపీ మ్యాజిక్ చేసింది. పార్టీ కోసం ఒక్కడు నిలబడి ఫలితాలను మలుపు తిప్పారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించిన వేళ… నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి సునామీని తట్టుకుటూ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగరేసింది. అయితే, దీని వెనుక వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడు, అనుసరించిన పక్కా వ్యూహాలే వైసీపీకి విజయాన్ని అందించాయని కీలక కారణమన్న చర్చ మొదలైంది. అయితే చైర్మన్ అభ్యర్థి విజయంపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే నందికొట్కూరుపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ పక్కా గ్రౌండ్ లెవల్ ప్లాన్‌తో ముందుకు సాగుతూ ఓట్లుగా మలిచే ప్రయత్నం చేశారు. ఫలితంగా నందికొట్కూరులో మొత్తం 32 వార్డులకు గానూ.. ఏకంగా 23 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే చైర్ పర్సన్ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్న వేళ, తన సొంత ఇలాకాలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్లాన్, దూకుడుతో వైసీపీ ఏకపక్ష మెజార్టీని రాబట్టిందని తెలుస్తోంది. దాంతో పార్టీలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన పట్టును నిరూపించుకోవడంతో ఈ విజయం దోహదం చేస్తుందని హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి అడ్డా అయిన జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాలైన పులివెందుల, పుంగనూరులలో కూటమి ఘన విజయాలు సాధించింది.

వైసీపీ యూత్ కేడర్లో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఈ గెలుపుతో మరోసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నడిచింది. మొత్తం నందికొట్కూరు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గానూ 23 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు జెండా ఎగరేశారు. దీంతో.. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ వశమైంది.