ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ…!

ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ.

రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు

జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం..

చర్యలు తీసుకోవాలని ఆదేశం.

ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని ఆదేశం..

ప్రైవేటు పాఠశాలల ఏకపక్ష నిర్ణయాలు, తల్లిదండ్రులపై మోపుతున్న ఆర్థిక భారంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ పెరిగింది. దీనిని సుమోటోగా స్వీకరించిన కమిషన్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలలు కేవలం తమకు కమీషన్లు వచ్చే పబ్లికేషన్లనే విద్యార్థులు కొనాలని బలవంతం చేయడంపై వివరణ కోరింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం (National School Bag Policy) ప్రకారం.. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించాలని, అనవసరమైన ప్రైవేట్ పబ్లికేషన్స్ పుస్తకాలను రుద్దకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను చాలా పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాఠశాల ఆవరణలోనే లేదా నిర్ణీత దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలనే నిబంధనలు పెట్టకూడదని స్పష్టం చేసింది
పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ప్రైవేట్​ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల అధికం కావడంతో ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని ఆదేశలు ఇవ్వడం జరిగింది …యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఎక్కడాలేని విధంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. వివిధ రకాల పేర్లతో చిన్న పిల్లల నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థుల వరకు పుస్తకాలు, నోట్ బుక్స్, టై, యూనిఫాం, షూ, బెల్ట్ పాఠశాలలోనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని పిటిషన్ దారులు కోరడం జరిగింది.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాలి..