నేపాల్‌కు మరో ముప్పు.. మళ్లీ వరదల హెచ్చరికలు జారీ..

నేపాల్‌కు మరో ముప్పు.. మళ్లీ వరదల హెచ్చరికలు జారీ..

భోటేకోషి నదిలో నీటిమట్టం మరోసారి భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ NDRRMA హెచ్చరిక

నదిలో నీటిమట్టం పెరిగినట్లు శబ్దాలను గుర్తించినట్లు రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం వచ్చిందని వెల్లడి

కాబట్టి.. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాలు హైఅలర్ట్‌లో ఉండాలని సూచనలు జారీ చేసిన NDRRMA

మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశమూ ఉందని నేపాల్ వాతావరణ శాఖ వెల్లడి..

నదుల ప్రవాహం పెరుగుతుండటంతో…
నేపాల్ లో మళ్లీ వరద ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. భోటే కోషి నదిలో వరద ప్రవాహం పెరిగింది. పలు జిల్లాలకు వరద ముప్పు హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రసువా, నువాకోట్, ధాడింగ్‌కు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ ప్రాంత వాసులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ఇళ్లలో విలువైన వస్తువులను తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు మరోసారి ఆవేదన భరితంగా ఉన్నాయి.

ఇంకా జలదిగ్భంధంలోనే గ్రామాలు…

ఇంకా నేపాల్ లోని జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు చిక్కుకుని ఉన్నాయి. బురద, కొండరాళ్లు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని తొలగించడానికి ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇంటి నిండా బురద. రాళ్లు. వాటిని తొలగించడం కష్టంతో కూడుకున్న పనేనని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ సాయం లేకుండా తాము ఒంటరిగా ఇళ్లను శుభ్రం చేసుకోలేమని చెబుతున్నారు. మరొకవైపు నేపాల్‌కు భారత్ సాయం కొనసాగుతుంది. 11 టన్నుల సామగ్రితో నేపాల్‌కు నాలుగో విమానం బయలుదేరి వెళ్లింది. ఐదు రోజుల్లో 68.5 టన్నుల నేపాల్ కు సాయమందించిన భారత్రెస్క్యూ కోసం నేపాల్‌కు భారత సాంకేతిక బృందాన్ని కూడా పంపింది. వంతెనల నిర్మాణానికి 16 ట్రక్కుల సామగ్రిని పంపింది. మరొకవైపు నేపాల్ వరదల్లో గల్లంతయిన 108 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత ప్రభుత్వం ప్రకటించింది. వారిని దేశానికి తీసుకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.