టిబెట్‌లో భారీ మట్టి చరియలు.. భారీగా ప్రాణనష్టం… !

టిబెట్‌లో భారీ మట్టి చరియలు.. భారీగా ప్రాణనష్టం.

టిబెట్‌లోని షిగాట్సే నగరం జిలాంగ్ కౌంటీలోని జిలాంగ్ పోర్ట్ వద్ద ఈరోజు ఉదయం 10:30 గంటలకు భారీ మట్టి చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. అయితే మృతులు, గాయపడిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
https://x.com/NepalPoliceHQ/status/2092469695371006058?s=20 : నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. ఆకస్మికంగా సంభవించి వరద కారణంగా ఊరు కొట్టుకుపోగా.. ఊరిలోని 1,000 మంది వరకు ఇందులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీరి పరిస్థితి గురించిన సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ఆ వ‌ర‌ద‌ల్లో 105 మంది భార‌తీయులు అదృశ్య‌మైన‌ట్లు కూడా తెలుస్తోంది…ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు సురక్షిత, ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ ఘటన జరిగింది నేపాల్‌లోని రసువా జిల్లాలోని స్యాప్రు బేసి, టిమురే ప్రాంతాల్లో. ఇది పర్వత ప్రాంతం. పైగా ఇక్కడ భోటె కోషి అనే నది ఉంది. ఈ నది టిబెట్ నుంచి నేపాల్‌వైపు ప్రవహిస్తుంది. ఈ నదిలో నీరు ఉప్పొంగడంతోపాటు, దిగువ లోయ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ వరద సంభవించింది…