చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి.. ఇది నేపాలీ గ్యాంగ్ పనే…….

అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా నిలిచే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఘోరకలి సంభవించింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా సహాయకురాలే ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు………

బాధితురాలిని నిందితులు అత్యంత అమానుషంగా హతమార్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కలిగి ఉన్నారు. హత్య సమయంలో ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి గట్టిగా నొక్కేశారు. చేతులు కాళ్లు కట్టేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారని ఆయన చెప్పారు. కేవలం దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంట్లో యజమానులు ఎవరూ లేని సమయాన్ని ముందే ప్లాన్ చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు…

నేపాలీ గ్యాంగ్ హస్తం

ఈ దారుణం వెనుక నేపాలీ ముఠా హస్తం ఉందని సీపీ స్పష్టం చేశారు. సుమారు ఏడాది క్రితం ఈ ఇంట్లో పనికి చేరిన నేపాలీ యజమానుల కదలికలపై నిశితంగా మహిళ నిఘా ఉంచింది. బయట నుంచి వచ్చిన తన గ్యాంగ్ సభ్యుల సహకారంతో ఆమె ఈ హత్యకు కారణమైంది. దొంగతనం చేసిన

కదలికలపై నిశితంగా నిఘా ఉంచింది. బయట నుంచి వచ్చిన తన గ్యాంగ్ సభ్యుల సహకారంతో ఆమె ఈ హత్యకు కారణమైంది. దొంగతనం చేసిన అనంతరం నిందితులందరూ అక్కడి నుంచి పరారయ్యారు. నేపాలీ గ్యాంగ్‌లు నమ్మకంగా ఇంట్లో చేరుతూ అదును చూసి యజమానుల ప్రాణాలు తీయడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నేపాలీ పనిమనుషుల విషయంలో ప్రజలు చాలా కాలంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత రెండు నుంచి పోలీసులు ఈ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాలీ గ్యాంగ్‌లు తరచుగా ఇళ్లలో పనికి చేరి యజమానుల నమ్మకాన్ని గెలుచుకుంటాయి. సమయం దొరికినప్పుడు దొంగతనాలు చేస్తూ హత్యలకు వెనుకాడరని ఆయన హెచ్చరిక..

ఇళ్లలో పనిమనుషులను పెట్టుకునే వారు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సీపీ సూచించారు. వారి ఆధార్ కార్డులు, ఫోటోలు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని. పనిమనుషులు ఎవరితో మాట్లాడుతున్నారు? వారు ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాలపై యజమానులు నిరంతరం కన్నేసి ఉంచాలి. అపరిచిత వ్యక్తులను నేరుగా పనిలో పెట్టుకోవడం ప్రాణాల మీదకు తెస్తుందని ఆయన హెచ్చరించారు. ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి ఇంట్లోనే ఇలాంటి ఘటన జరగడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది…