🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☀️పంచాంగం☀️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 08 – 06 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ద్వాదశి* ఉ6.54 వరకు,
నక్షత్రం : *స్వాతి* మ12.44 వరకు,
యోగం : *పరిఘము* మ12.47 వరకు,
కరణం : *బాలువ* ఉ6.54 వరకు,
తదుపరి *కౌలువ* రా7.55 వరకు,
వర్జ్యం : *సా6.56 – 8.42,*
దుర్ముహూర్తము : *సా4.44 -5.36,*
అమృతకాలం : *లేదు,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.29,
*_నేటి విశేషం_*
*శివ – ప్రదోషవ్రతం*
త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు.
సకల సుఖాలు, సర్వ సంపదలు ప్రసాదిస్తాడు, ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు.
ప్రతి నెలలోనూ శుక్ల, కృష్ణపక్షాల్లో సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ప్రదోష వ్రతం చేస్తారు.
శుక్లపక్ష సోమవారం, బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.
ఈ వ్రతం ఆచరించడానికి హంగులు, ఆర్భాటాలూ ఏమీ అక్కర్లేదు.
అయితే ఇది సుదీర్ఘకాలంపాటు అంటే 11 సంవత్సరాలపాటు చేయాల్సిన వ్రతం.
మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి, చేయలేకపోతే ఉద్యాపన చేయవచ్చు.
సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో స్నానం చేయాలి, పూజా మందిరంలో తడిమట్టితో లింగాన్ని రూపొందించుకుని శూలపాణయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించాలి.
యధాశక్తిగా స్వామిని పూజించి, పారేనీటిలో శివలింగాన్ని విడిచిపెట్టేయాలి. ఈ విధంగా ప్రతి త్రయోదశినాడు సాయంత్రవేళల్లో శివుని పూజించే వ్రతానికే ప్రదోష వ్రతమని పేరు.
*_☀️శుభమస్తు☀️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏