*వారానికి రెండుసార్లు తిన్నా ప్రమాదమే!*
బయటి ఫుడ్, ముఖ్యంగా ఫ్రైడ్ రైస్ ను వారంలో రెండు మూడు సార్లు తింటే అనేక సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ వేడి చేసిన అన్నం జీర్ణక్రియను దెబ్బతీసి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మంటకు కారణమవుతుంది. పదేపదే వాడిన నూనె, అధిక ఆయిల్ గుండెకు హానికరం. సోయాసాస్, చిల్లీ సాస్‌లోని ఉప్పు రక్తపోటును పెంచుతుంది. కేలరీలు ఎక్కువగా ఉండటంతో బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదం కూడా ఉంటుంది..
*ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత*
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా పలువురు నటులు చేరుకున్నారు. ఐకానిక్ ‘షోలే’తో సహా 300కు పైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటించారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 2012లో పద్మభూషణ్ అందుకున్నారు..
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు: హౌసింగ్ కార్పొరేషన MD*
తెలంగాణ : ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై POT యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ హెచ్చరించారు.
అమ్మిన ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇళ్లను అద్దెకు ఇచ్చినా కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
GHMC పరిధిలో ఇప్పటికే సర్వే పూర్తయ్యిందని, త్వరలో జిల్లాల్లో కూడా పరిశీలిస్తామని చెప్పారు. కొల్లూరు, రాంపల్లిలో కొన్ని ఇళ్లను ₹20–50 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు.
*హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్ పెట్టిన పోలీసులు*
హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా. మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు..
*బెంగుళూరులో దోచి.. హైదరాబాదులో చిక్కి*
*ముఠాలో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో పట్టుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్*
బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌లోనే పట్టుబడ్డారు. అక్కడ చిక్కిన దుండగులు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం హైదరాబాద్ వచ్చిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు సిటీ పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన పోలీసులు బెంగళూరుకు తరలించారు. సినీ పక్కి లో చోటు చేసుకున్న ఈ దోపిడీ బెంగళూరు తో పాటు వివిధ రాష్ట్రాలలో సంచలనం కేసుగా అయ్యింది..
స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ
TG: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. 5 వేల పైగా ఓటర్లకు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు.. 5 వేలలోపు ఓటర్లు ఉంటే రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాలని పేర్కొంది. అలాగే 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల మాత్రమే ఖర్చు పెట్టాలని తెలిపింది…
సీఎం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన జగన్
చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్న జగన్
పంటల ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
దుబారా ఖర్చులకు కోట్లు కేటాయిస్తూ రైతులను విస్మరించారని ఆరోపణ
ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటివి నిర్వీర్యం చేశారని ధ్వజం
ప్రభుత్వ వైఫల్యాలపై రైతులు కాలర్ పట్టుకునే రోజు వస్తుందని హెచ్చరిక
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, వారి బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు పతనమైనా ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడటం లేదని, ఇది చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ పంటలను తామే ట్రాక్టర్లతో దున్నేసుకునే దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు జగన్ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. “చంద్రబాబు గారూ, మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద చొక్కా కూడా లేకుండా చేసి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. రైతుల కష్టాలు, కన్నీళ్లు కనిపించకుండా చేసేందుకే ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో మీరు రైతుల కోసం ఎక్కడ, ఎప్పుడు నిలబడ్డారో చెప్పాలి” అని జగన్ నిలదీశారు.
ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందంటూ జగన్ తీవ్రంగా స్పందించారు. “మీరు తిరగడానికి మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, మీ విదేశీ పర్యటనలు, రాజకీయ కక్ష సాధింపు కేసుల కోసం లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పు కొట్టే ఎల్లో మీడియాకు కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు గానీ, రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రావడం లేదు” అని ఆయన ఆరోపించారు. పది వేల మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పలు చెప్పుకోవడం కాదని, పది మంది కలెక్టర్లకు ఫోన్ చేసి ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎందుకు ఆదేశించలేకపోయారని ప్రశ్నించారు.
ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తితో పాటు గతంలో కందులు, మినుములు, మిర్చి, పొగాకు, ఉల్లి, మామిడి వంటి పంటల ధరలు దారుణంగా పడిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని జగన్ విమర్శించారు. “ఈ 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులు వస్తే ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతుల పక్షాన మేము పోరాడితే మాపై ఎదురుదాడి చేస్తూ, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మిర్చి, మామిడి రైతుల విషయంలో చేసిన హడావుడి ప్రకటనలు ఆచరణలో ఏమయ్యాయి?” అని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు. “ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? ఎన్నికల్లో ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, రెండేళ్లకు ఇచ్చింది కేవలం రూ.10 వేలు మాత్రమే. ఆర్బీకేలు, ఇ-క్రాప్, పొలం వద్దే పంట కొనుగోలు వంటి వ్యవస్థలన్నీ నాశనం చేశారు. రైతులు ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించే దుస్థితికి తెచ్చారు” అని జగన్ విమర్శించారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మోసాలను, వంచనను, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, చంద్రబాబు కాలర్‌తో పాటు ఆయన పార్టీ నేతల కాలర్‌ను పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్ తీవ్రంగా హెచ్చరించారు.