నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 20 – 01 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *షష్ఠి* ఉ8.58వరకు,
నక్షత్రం : *హస్త* సా7.50 వరకు,
యోగం : *సుకర్మ* రా2.34 వరకు,
కరణం : *వణిజ* ఉ8.58 వరకు
తదుపరి *విష్ఠి* రా10.02 వరకు,

వర్జ్యం : *తె4.42 – 6.29,*
దుర్ముహూర్తము : *మ12.33 – 1.17,*
మరల *మ2.46 – 3.30,*
అమృతకాలం : *మ1.13 – 2.59,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.43,

*_నేటి మాట_*

*భగవంతుడు చిక్కాలంటే ??*
భగవంతుడు కావాలంటే ఊరికే దొరకడు.
ఆ భావన నిజంగా మనసులో రావాలి.
రాగానే వేదాలను ఆశ్రయించాలి.
శాస్త్రాలను పట్టుకోవాలి, అంతవరకూ మనం విశ్రయించకూడదు.

భగవంతుడు కోసం మన దారి మనమే వెతుక్కోవాలి, మన సాధన మనమే చేయాలి.
పలు రకాల పరీక్షలను ఎదుర్కోవాలి, యోగి కానివ్వండి, భోగి కానివ్వండి, రోగి కానివ్వండి హృదయం పరిశుద్ధమైన తరువాతనే భగవంతుడు తన లోపలికి అనుజ్ఞ ఇస్తాడు.

హృదయ పరిశుద్ధత లేనిదే భగవంతుణ్ణి పొందాలంటే కుదరదు.
పాండిత్యం, శాస్త్ర పరిచయాలు, శ్లోకార్థాలన్నీ మన భావాలను విస్తృతము చేసుకోవడానికి పనికివస్తాయి తప్ప భగవంతుణ్ణి పొందడానికి కాదు.

మనలను మనం భగవంతునికి అర్పించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా, ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కనే చిక్కడు.

*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏