దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ప్రయోగించింది. జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. లాంగ్‌మార్చ్ 2డీ రాకెట్ పీఆర్ఎస్సీ-ఈ1ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది…పాకిస్థాన్ తొలి స్వదేశం ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శాటిలైట్ ఫొటోను సైతం షేర్ చేశారు. ఫొటోను షేర్ చేసిన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. సెటైర్లు వేస్తూ మీమ్స్‌ను షేర్ చేశారు.
కొందరు పాక్ శాటిలైట్ నీళ్ల ట్యాక్లా ఉందని కొందరు.. వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్లా ఉందని మరికొందరు ట్వీట్ చేశారు. పాకిస్థాన్ తొలి స్వదేశీ ఎలక్ట్రో ఆప్టికల్ ఉపగ్రహాన్ని చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారని.. ఇది దేశానికి గర్వకారణమని.. శాస్త్రవేత్తలకు అభినందలు చెబుతూ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ పాక్ శాటిలైల్ అచ్చం నీటి ట్యాంకులా ఉందని చెప్పగా.. మరో యూజర్ వాటర్ బాటిల్ ఉందని.. మరికొందరు కొబ్బరినూనె బాటిల్ కామెంట్ చేశారు. మరో యూజర్ గ్యాస్ సిలిండర్లా ఉందంటూ స్పందించారు..