నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 30 – 01 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *పాడ్యమి* సా5.47 వరకు,
నక్షత్రం : *శ్రవణం* ఉ8.51 వరకు,
యోగం : *వ్యతీపాత* రా8.38 వరకు,
కరణం : *బవ* సా5.47 వరకు,
తదుపరి *బాలువ* తె5.03 వరకు,

వర్జ్యం : *మ12.44 – 2.17,*
దుర్ముహూర్తము : *ఉ10.21 – 11.06,*
మరల *మ2.50 – 3.35,*
అమృతకాలం : *రా10.04 – 11.37,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.50,

*_నేటి విశేషం_*

*మాఘ మాసం ప్రారంభం*
మాఘ మాస విశిష్టత తెలుసుకుందాము…
మన పంచాంగం ప్రకారం , కార్తీక మాసం తర్వాత అంతా ప్రాముఖ్యత మాఘ మాసానికి ఇస్తారు.
మఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది.
అంతేకాదు, ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని ప్రతీతి,
ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థం, అందుకే యజ్ఞయాగాది క్రతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో మాఘ మాసం విశిష్టత తెలుసుకుందాం.

*మాఘ మాసంలో నదీ స్నానం విశిష్టత*

మాఘ మాసంలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని విశ్వసిస్తారు.
మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారు.
మృకండు మహర్షి-మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని చెబుతారు.

మరో పురాణ కథనం ప్రకారం.. పూర్వం ఓ గంధర్వుడు ఉండేవాడు.
ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది.
ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. .

*మాఘ మాసంలోని పండుగలు*

*వంసత పంచమి:*
 మాఘ శుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి జన్మించిందని చెబుతుంటారు.

*రథసప్తమి:*
ఈ రోజున సూర్య భగవానుడు జన్మించాడని చెబుతారు. రథ సప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదని హిందువులు నమ్ముతారు.

*భీష్మాష్టమి:*
మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్చంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘస్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి.

*భీష్మ ఏకాదశి:*
 భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు.
*మాఘపూర్ణిమ*: 
సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ ‘మాఘ పూర్ణిమ’ అత్యంత విశేషమైనది. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజు శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది.

మాఘమాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు,
ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఇక ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకునే తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది.

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏