🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 31 – 01 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *విదియ* సా4.18 వరకు,
నక్షత్రం : *ధనిష్ఠ* ఉ8.09 వరకు,
యోగం : *వరీయాన్* సా6.11 వరకు,
కరణం : *కౌలువ* సా4.18 వరకు
తదుపరి *తైతుల* తె3.24 వరకు,
వర్జ్యం : *మ3.02 – 4.34,*
దుర్ముహూర్తము : *ఉ8.51 – 9.36*
మరల *మ12.35 – 1.20,*
అమృతకాలం : *రా12.14 – 1.46,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.50,
*_నేటి మాట_*
*మనకు కావల్సింది – భగవంతుడిని ఎలా అడగాలి???*
ఈరోజుల్లో ఇది చాలా మందికి ఒక పెద్ద విచారం!!…
మనము భగవంతుడు అనే నమ్మకం , విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు చేరినపుడు, ఇంకా ఆయనకు నివేదించడం అవసరమా???
మన కన్న తల్లి టైం కి మనకు ఏమి కావాలో తెలుసుకొని అన్నీ అందిస్తుంది,
మనము ఉద్యోగం చేసే కంపనీ వారు మనకు ఎప్పుడు ఏమీ కావాలో అన్నీ అందిస్తుంది …
మరి వీటన్నిటినీ సృష్టించిన ఆ దేవదేవుడు నీకు ఏమి కావాలో ఆయనకు తెలియదా !!!…
” మీరు భగవంతుడుని అది కావాలి, ఇది కావాలి అని అడగవద్దు”…
మనసులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోండి, అయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉండండి…
రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు కోరుకుందా?
శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని!?
కృష్ణుని కుచేలుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని ?
వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చెంతకు రప్పించాయి.
మీ మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ విశ్వాసాలు ఉంటే మీరు ఎదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు.
యాచించడం నిజ భక్తుని లక్షణం కాదు!!…
“మీ మనసులో భగవంతుని నిలుపుకొండి…సమస్తమూ మీ చెంతకే వచ్చి చేరుతుంది…”
ఇది సత్యం …
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏