నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 07 – 03 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *అష్టమి* మ1.41 వరకు,
నక్షత్రం : *మృగశిర* తె3.29 వరకు,
యోగం : *ప్రీతి* రా10.14 వరకు,
కరణం : *బవ* మ1.41 వరకు,
తదుపరి *బాలువ* రా12.52 వరకు,

వర్జ్యం : *రా9.54 – 11.25*
దుర్ముహూర్తము : *ఉ8.39 – 9.26,*
మరల *మ12.34 – 1.21,*
అమృతకాలం : *రా7.04 – 8.36,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.19,
సూర్యాస్తమయం: 6.03,

*_నేటి మాట_*

*అద్వైత సిద్దాంతము అనగా నేమి??*
కర్మలు చేయు అధికారము జీవులకు ఉన్నది కానీ, కర్మ ఫలము నడిగే హక్కు జీవునకు లేదు.
ఈ ఫలము ఎప్పుడు చేకూరునని గానీ, ఎప్పటికిని చెప్పుట ఎవరికినీ సాధ్యము కాదు.
కర్మ ఫలము మాత్రము అనుభవింపవలసినదే! …
కర్మాద్యక్షుడు, సర్వ సాక్షి యునగు పరమేశ్వరుడు ఒక్కడే కర్మ ఫలప్రదాయకుడు.

జీవుల దేహ నిర్మాణము, వారి కర్మల ననుసరించి, వారు తగిన లోకములను పొందుదురు.
అసలు జగత్తు ఎటుల ఎప్పుడు సృజింప బడినదను తెలుసుకొనుట అసంభవము, అని శృతి స్మృతులు తెలుపు చున్నవి.

సృష్టి ఎట్లు కలిగినదను ప్రశ్న కు సమాధాన మేమంటే, కలలు ఎట్లు కలుగు చున్న వన్న ప్రశ్నకు జవాబు తెలిస్తే, సృష్టి ఎట్లు కలుగు చున్నదని ప్రశ్నకు సమాధానము వచ్చును.

నిద్ర కలలను సృష్టించు చున్నది.
మాయా శక్తి జగత్తు ను సృష్టించు చున్నది,
కనుపించునదంతా కల వంటిదే… _ఇదే అద్వైత సిద్దాంతము._

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏