నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 17 – 03 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,

తిథి : *తదియ* సా4.57 వరకు,
నక్షత్రం : *చిత్ర* మ12.40 వరకు,
యోగం : *ధృవం* మ1.57 వరకు,
కరణం : *విష్ఠి* సా4.57 వరకు,
తదుపరి *బవ* తె6.00 వరకు,

వర్జ్యం : *సా6.52 – 8.39*
దుర్ముహూర్తము : *మ12.32 – 1.20,*
మరల *మ2.55 – 3.43,*
అమృతకాలం : *ఉ7.21 వరకు,*
మరల *తె5.31 నుండి,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.12,
సూర్యాస్తమయం: 6.06,

*_నేటి విశేషం_*

*సంకష్టహర చతుర్థి*
_ఈ రోజున గణపతికి మరియు చంద్రునికి సమర్పించే అర్ఘ్యములు చాలా ముఖ్యమని గణపతి కధలు చెబుతున్నాయి_

*సంకష్టహర చతుర్థి రోజున గణపతికి ఇచ్చే మూడు అర్ఘ్యములు*

దోసిలితో నీరు, పుష్పములు, గంధమును ఉంచుకొని స్వామికి చూపించి పళ్ళెములో వదలాలి.

*శ్లో. 1*
*గౌరీసుత నమస్తేస్తు సర్వసిధ్ధి ప్రదాయక !*
*సర్వ సంకటనాశార్ధం గృహాణార్ఘ్యం నమోస్తుతే !!*

శ్రీ సంకష్టహర గణపతయే నమః *ప్రథమార్ఘ్యం* సమర్పయామి.

*శ్లో. 2*
*విఘ్ననాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం !*
*తత్ప్రసాదేన సర్వాణి-కార్యాణి చ కరోమ్యహమ్ !!*

శ్రీ సంకష్టహర గణపతయే నమః *ద్వితీయార్ఘ్యం* సమర్పయామి.

*శ్లో. 3*
*ఫాలచంద్ర నమస్తుభ్యం భక్తానాం భద్రదాయక !*
*గంధ పుష్పై ఫలైర్యుక్తం గృహాణార్ఘ్యం మయార్పితమ్ !!*

శ్రీ సంకష్టహర గణపతయే నమః *తృతీయార్ఘ్యం* సమర్పయామి.

*సంకష్టహర చతుర్థి రోజున చంద్రునికి ఇచ్చే మూడు అర్ఘ్యములు*

*శ్లో.*
*నమస్సోమాయ దేవాయ ద్విజరాజాయ పాలినే !*
*పాహిమాం కృపయా దేవ నక్షత్రేశ నమోస్తుతే !!*

అని చంద్రుని ప్రార్ధించి, ఈ దిగువ మంత్రముతో చంద్రునకు *మూడు* అర్ఘ్యములను ఇవ్వవలెను.

*శ్లో.1*
*క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ !*
*గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహిత ప్రభో !!*

శ్రీ రోహిణీ చంద్రమసేనమః *ప్రథమార్ఘ్యం* సమర్పయామి.

*శ్లో. 2*
*నమస్తే రోహిణీశాయ సుధారూప నిశాకర*
*గృహాణార్ఘ్యం మయాదత్తం రమానుజ నమోస్తుతే !!*

శ్రీ రోహిణీ చంద్రమసేనమః *ద్వితీయార్ఘ్యం* సమర్పయామి

*శ్లో. 3*
*క్షీరసాగర సంభూత సుధారూప నిశాకర*
*గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా ఏహిలోప్రభు*
*గృహాణార్ఘ్యం మయాదత్తం రమానుజ నమోస్తుతే !!*

శ్రీ రోహిణీ చంద్రమసేనమః *తృతీయార్ఘ్యం* సమర్పయామి

*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏