🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 20 – 03 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,
తిథి : *షష్ఠి* రా10.36 వరకు,
నక్షత్రం : *అనూరాధ* సా7.56 వరకు,
యోగం : *వజ్రం* మ3.16 వరకు,
కరణం : *గరజి* ఉ9.46 వరకు,
తదుపరి *వణిజ* రా10.36 వరకు,
వర్జ్యం : *రా1.58 – 3.41*
దుర్ముహూర్తము : *ఉ10.08 – 10.56,*
మరల *మ2.55 – 3.43,*
అమృతకాలం : *ఉ8.34 – 10.19,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.09,
సూర్యాస్తమయం: 6.07,
*_నేటి మాట_*
*సహజభక్తి – విశేష భక్తి*
భక్తిలేని జీవితము, శ్వాస లేని దేహము వంటిది.
భక్తిలో రెండు విధములు వున్నాయి
1, సామాన్య భక్తి,
2, విశేష భక్తి.
పూజలు వ్రతములు, క్షేత్ర దర్శనము, తీర్థ స్నానములు మొదలయిన వాటిని శ్రధ్ధగా చేయడము – ఇది సహజ భక్తి… లేక సామాన్య భక్తి.
ఇక విశేష భక్తి అంటే!!…
చిత్తశుద్ధి, శీలము, విచారణ, ఆచరణ – వీటితో చేరిన భగవదారాధన.
మితవాక్కు, మంచి చూపు, సత్కధా శ్రవణము, – ఇవి విశేష భక్తి లక్షణాలు.
మరి ఈరోజుల్లో మనం ఏ తరగతిలో వున్నామో ఒకసారి తెలుసుకోవాలి!!…
ఒకే క్లాసులోనే సంవత్సరాలు చదివితే పిల్లలకు ఎంత అవమానమో,
సంవత్సరాల కొద్దీ, సామాన్య భక్తిలోనే మునిగియుండటము కూడా వ్యక్తికి అవమానమే కదా!!..
శాస్త్రాలలో వ్యక్తి అంటే తనలోని దివ్యత్వమును వ్యక్త పరచేవాడే వ్యక్తి అని చెబడ్డాడు.
_ఒకసారి ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి??_
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏