🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 02 – 04 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చవితి* ఉ7.33 వరకు,
తదుపరి *పంచమి* తె5.25 వరకు,
నక్షత్రం : *కృత్తిక* మ1.50 వరకు,
యోగం : *ప్రీతి* ఉ10.51 వరకు,
కరణం : *భద్ర* ఉ7.33 వరకు,
తదుపరి *బవ* సా6.29 వరకు,
ఆ తదుపరి *బాలువ* తె5.25 వరకు,
వర్జ్యం : *తె4.54నుండి,*
దుర్ముహూర్తము : *ఉ11.39 – 12.27,*
అమృతకాలం : *ఉ11.35 – 1.05,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.00,
సూర్యాస్తమయం: 6.09,
*_నేటి విశేషం_*
*🌹చైత్ర శుద్ధ పంచమి🌹*
లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు
పూజించాలి.
అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.
అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి.
శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి.
ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది.
ఒకవేళ చేయలేకపోయినా శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.
*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏