నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 25 – 04 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,

తిథి : *ద్వాదశి* ఉ8.21 వరకు,
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* తె4.19 వరకు,
యోగం : *ఐంద్రం* ఉ9.51 వరకు,
కరణం : *తైతుల* ఉ8.21 వరకు,
తదుపరి *గరజి* రా7.16 వరకు,

వర్జ్యం : *మ2.44 – 4.15,*
దుర్ముహూర్తము : *ఉ8.12 – 9.02,*
మరల *మ12.22 – 1.12,*
అమృతకాలం : *రా11.48 – 1.18,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.42,
సూర్యాస్తమయం: 6.13,

*_నేటి మాట_*

*మనం చేసే కర్మలు – పరుల కోసమా ?? భగవద్ అనుగ్రహము కొరకా???*

ఇది చాలా మందికి ఒక పెద్ద సమస్య, చాలా ప్రావీణ్యం గలవారు కూడా, అప్పుడప్పుడు మాయలో పడి, అర్థం కాకుండా వుంటారు, …
_మరి ఆ మాయలో పడకుండా వుండాలంటే ఏమీ చేయాలి మరి!!_
ఒక గుడిలో ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు…

ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తుండేది, రోజూ దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తుండేది,
ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది, ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడుస్తువుండేది,…
తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది … మరో పందితో ఇలా అంటుంది,
చూసావా…
ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది, నేను చిన్నదానినైనా , ఎంత భయపడుతుంది అని గర్వంగా చెప్పుకొనేది …
ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగిందట …
నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా ?? అని, అప్పుడు గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పిందట…

“నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..???

“నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను”…

“నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను” … నా సేవ, నా కార్యం ముఖ్యం, అంతే కానీ దాని గూర్చి నాకెందుకు???

*అలానే …!!*
మన మంచి, మన ధర్మం, ఏంటో మనకు తెలిస్తే చాలు, మన పని భగవంతుడికి నచ్చితే చాలు, నలుగురికి నచ్చాలని, ఆరాట పడకూడదు, ఇతరులు ఎలా మాట్లాడినా , పట్టించుకోకూడదు…

*ఇది ఎప్పుడు, ఎలా సాధ్యమవుతుంది ???*
కేవలం భగవంతుని పై, అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే…

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏