🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 24 – 06 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,
తిథి : *చతుర్దశి* సా6.36 వరకు,
నక్షత్రం : *రోహిణి* మ12.49 వరకు,
యోగం : *శూలం* ఉ9.53 వరకు,
కరణం : *భద్ర* ఉ7.44 వరకు,
తదుపరి *శకుని* సా6.36 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ 6.49వరకు,*
మరల *సా6.07 – 7.37,*
దుర్ముహూర్తము : *ఉ8.06 – 8.59,*
మరల *రా10.56 – 11.40*
అమృతకాలం : *ఉ9.49 – 11.19,*
మరల *తె3.11 – 4.41,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం: 6.34,
*_నేటి మాట_*
*సంసారం లో మన బంధువులు బంధాలు ఎలా ఉండాలి??*
మనం ఎక్కిన పడవ చుట్టూ నీరు ఉండడం వలన పడవ మునిగిపోదు.
పడవలోకి నీరు చేరడం వలనే పడవ మునిగిపోతుంది.
అలానే మనిషి సంసారంలో ఉన్నంత మాత్రమున చెడిపోడు!
పడవలోకి నీరు పోనంత వరకూ పడవకు ఎట్టి ప్రమాదమూ లేదు.
ఎప్పుడైతే పడవలోకి నీరు ప్రవేశించడం జరిగిందో అప్పటి నుండి మునిగిపోవడం ప్రారంభం అవుతుంది.
అలానే సంసారమునందలి విషయాలను తనలోకి చేర్చుకోకుండా ఉన్నంత వరకూ సంసారములో ఉన్నా కూడా సాధకుడు ఉద్దరింపబడగలడు, అయితే మితిమీరిన సంసారాలు బంధాలు ఏనాడైతే తనలోకి అనుమతిస్తాడో ఆనాటి నుండి తన పతనమునకు తానే దారులు సిద్దపరిచిన వాడవుతాడు.
ప్రాపంచికమైన ఏ బంధమైనా పరిమితి మేరకే!
అంతకు మించి అతుక్కుపోవడం వినాశనమే అని చెప్పక తప్పదు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏