నేటి పంచాంగం.. నేటి విశేషం..

ఓం శ్రీ గురుభ్యోనమః
🪷పంచాంగం🪷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 22 – 08 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
బహుళ పక్షం,

తిథి : *చతుర్దశి* ఉ11.53 వరకు,
నక్షత్రం : *ఆశ్లేష* రా1.16 వరకు,
యోగం : *వరీయాన్* సా4.34 వరకు,
కరణం : *శకుని* ఉ11.53 వరకు,
తదుపరి *చతుష్పాత్* రా11.35 వరకు,

వర్జ్యం : *మ2.05 – 3.41,*
దుర్ముహూర్తము : *ఉ8.17 – 9.07,*
మరల *మ12.28 – 1.18,*
అమృతకాలం : *రా11.40 – 1.16,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.47,
సూర్యాస్తమయం: 6.20,

*_నేటి విశేషం_*

*ఈ శ్రావణమాసంలో ఆఖరు శుక్రవారం*
శ్రీమహాలక్ష్మి వరలక్ష్మిగా శ్రావణమాసానికి అధిష్ఠాత్రి. ‘ఆర్ద్రాంపుష్కరిణీం’ అని శ్రీసూక్తం చెప్పినట్లు తల్లి కరుణామయి.
అంతేకాదు, ‘అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్లందమే గృహాత్’ అంటే అనైశ్వర్యం, అసమృద్ధిని లేకుండా చేసే తల్లి.
ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే స్త్రీలు సాత్వికమైన మార్గంలో జీవనయానం సాగించాలి.

‘పద్మప్రియే పద్మిని పద్మహస్తే-పద్మాలయే పద్మదళాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ’

అంటూ తల్లిని స్మరించి శరణాగతులైతే చాలు ఆ తల్లి చల్లని చూపులు వరాలై మనపై వర్షిస్తాయి.
వరలక్ష్మిగా కీర్తి గాంచిన అమ్మ, పరాశక్తి అంశారూపం, వరాలను వర్షించిన దేవత కనుక వరలక్ష్మీ దేవి అయింది. అందువల్ల ఆ దేవతను కొలిస్తే కోరిన వరాలిస్తుందని నమ్మకం.
అంతేకాక ‘వర’ అంటే శ్రేష్ఠమైనదని అర్ధం.
అందువల్ల ఇది శ్రేష్ఠమైన లక్ష్మీదేవి వ్రతమని తెలుసు కోవాలి.
వరలక్ష్మి దేవికి కొన్ని ప్రత్యేకతలున్నాయి, అదేమంటే లక్ష్మీదేవి అష్ట రూపాలలో ‘వరలక్ష్మి’ రూపం లేదు.
ఇది భిన్నమైనది, అష్టలక్ష్ముల అనుగ్రహం పొందడానికి అవసరమైన అర్హత నివ్వగలిగేది.
ఇక మరో ప్రత్యేకత సాధారణంగా మనం చేసుకునే వ్రతాలకు వరలక్ష్మీ వ్రతానికి కొంత వ్యత్యాసముండడం. మిగతావి నిర్దిష్టమైన ఫలితాన్ని ఆశించేవి.
విధి యుక్తంగా ఆ వ్రతం చేస్తే ఆ ఫలితం ఒనగూడుతుందని నమ్మకం.
ఆ నమ్మకం కలగడానికి ఒక కథ ఉంటుంది.
కాని వరలక్ష్మి వ్రతంలో కథకు, వ్రతానికున్నంత ప్రాముఖ్యం ఉంది.

శ్రీమహాలక్ష్మి వరలక్ష్మిగా శ్రావణమాసానికి అధిష్ఠాత్రి. ‘అల్ట్రాం పుష్కరిణీం” అని శ్రీసూక్తం చెప్పినట్లు తల్లి కరుణామయి.
అంతేకాదు ‘అభూతిమసమృద్ధించ సర్వాన్ని ర్లుదమే గృహాత్’ అంటే అనైశ్వర్యం, అసమృద్ధిని లేకుండా చేసే తల్లి.
ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే స్త్రీలు పరమ సాత్వికమైన మార్గంలో జీవనయానం సాగించాలి.
ఉత్తమ ఇల్లాళ్ళుగా భాసించాలి.
ఒకసారి లక్ష్మీదేవి తన భక్తులను సంరక్షించాలన్న సంకల్పంతో తనకు తానై భూలోకంలో పర్యటించింది. ఆ సందర్భంగా ఆమెను ఆకర్షించిన ఇల్లాలు చారుమతి.
ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి, తాను వరలక్ష్మినని చారుమతి జీవన విధానం పట్ల సంతృప్తి చెంది అనుగ్రహించదలచుకున్నానని, ‘వరలక్ష్మి’ వ్రత విధానాన్ని తెలిపి అదృశ్యమైంది.

ఈ వ్రతాన్ని గురించి కుమారస్వామి అభ్యర్థన మేరకు దీనిని శివుడు పార్వతికి చెప్పినట్లు పురాణ కథనం.
దానిని కుమారస్వామి భూలోకంలో వ్యాప్తి చేసినట్లు చెబుతారు.
ఈ వ్రత కథలోని చారుమతి వృత్తాంతం అందరికీ తెలిసిందే.
ఆ కథలో విశేషమేమంటే వరలక్ష్మీదేవి అడగకుండానే చారుమతిని అనుగ్రహించింది. అందుకు కారణం చారుమతి ప్రవర్తన, సద్బుద్ధి.

మితంగా మాట్లాడడం, కుటుంబ సభ్యుల పట్ల తన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తించడం ఆమెలో ఉన్న సద్గుణాలు.
మరో విశేషమేమంటే ఈ వ్రతం కూడా సత్యనారాయణ వ్రతం మాదిరి అందరూ చేయడానికి ఏర్పాటు చేసినది.
అంటే దైవ సంబంధమైన సత్కార్యాలలో వర్షాల పట్టింపులు ఉండకూడదని తెలిపేది.
ఇప్పుడు లేవు గాని ఒకప్పుడు ఆ పట్టింపులు ఎక్కువగా ఉండేవి.
దైవపూజకు అందరూ అర్హులేనని చాటే సందేశం ఇచ్చే వ్రతాల్లో ఇదొకటి.
ఇంకొక విశేషం ఏమంటే సత్కార్యం చేసేటపుడు ఒంటరిగా కాక అందరూ కలిస్తే ఎక్కువ ఫలితం చేకూరుతుందని, అందిన ఫలితాన్ని అందరూ సమా నంగా పంచుకోవచ్చనే సత్యాన్ని ఇది తెలియజేస్తుంది.
ఇది అన్ని విషయాలకూ అన్వయిం చుకోవలపిది, సమాజ సంపద అందరికీ సమా నంగా అందాలనే భావనెంతో అవసరం.

వరలక్ష్మీ వ్రత కథ ద్వారా తెలుసుకోవలసిన అంశం సత్ప్రవర్తన, తన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాదరాలు పెంచుకో వాలనే.
సత్ప్రవర్తన, సమాజంలోని అందరి పట్ల మెలగాల్సిన దానికి సంబంధించినది కాగా, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాదరాలతో మెలగడం తన కుటుంబం వరకూ నిర్వహించాల్సిన విధ్యుక్త ధర్మం.
ఇవే చారుమతి వ్యక్తిత్వం లో అమ్మకు నచ్చిన గుణాలు, అలా వ్యవహరిస్తే ప్రతి స్త్రీ ఒక చారుమతి అవుతుంది, దానిని గుర్తు చేయడం కూడా వరలక్ష్మీ వ్రత అంతరార్థం.

*_🪷శుభమస్తు🪷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏