నేటి పంచాంగం…నేటి మాట…!

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 16 – 09 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
బహుళ పక్షం,

తిథి : *దశమి* రా2.51 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* ఉ10.33 వరకు
యోగం : *వ్యతీపాత* ఉ7.11 వరకు
తదుపరి *వరీయాన్* తె4.44 వరకు,
కరణం : *వణిజ* మ3.45 వరకు
తదుపరి *భద్ర* రా2.51 వరకు,

వర్జ్యం : *రా10.04 – 11.36,*
దుర్ముహూర్తము : *ఉ8.16 – 9.05,*
మరల *రా10.45 – 11.32,*
అమృతకాలం : *తె4.32 నుండి,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.51,
సూర్యాస్తమయం: 6.01,

*_నేటి మాట_*

*భగవంతుని అనుగ్రహము పొందాలి అంటే ఎలా???*
భగవంతుని అనుగ్రహం పొందడానికి భావం ముఖ్యం,
భగవంతుడు ఎప్పుడూ బాహ్య ప్రియుడు కాదు, భావ ప్రియుడు మాత్రమే …
ఆయన, ఒక చిన్న పాట పాడినా భావం లేకుండా పాడితే అది ఎవరికీ అర్థం కాదు, అదే భావయుక్తంగా పాడితే , చిన్న పిల్లవాడు కూడా పరవశించి పోతాడు…
దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది.
సాధన అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు అనే కాదు.!!!
అడవులలో, గృహలలో కూర్చోవడమూ కాదు!!
సాధన ఎక్కడికో వెళ్లి చేయాల్సిన పనిలేదు!…
ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసు కొంచం మాధవునిపై పెట్టుకుంటే చాలు.
చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవచ్చు , అయన గూర్చి పాటలను పాడుకోవచ్చు…
ఖాళీ సమయాల్లో లేదా పని మీద బయటకు వెళ్లినపుడు ఎవరైనా యాచకులు లేదా దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కనబడితే వాళ్లకి ఎంతో కొంత సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి.

పెళ్లి రోజు, పుట్టిన రోజులంటూ పార్టీలు కోసం డబ్బు వృధా చేసే బదులు, ఏ అనాధాశ్రమంలోనో లేదా ఇంకేదైనా సమాజ సేవా కార్యక్రమాలకో వినియోగించడం చాలా ఉత్తమం,
దీని వలన దేవునికి గొప్ప సేవ చేసినవాళ్లమవుతాము…
దేవుడు కూడా ఎంతగానో సంతృప్తి చెందుతాడు, సాధన చిన్నదా పెద్దదా అని భగవంతుడు చూడడు…
ఏ భావనతో చేశామా అన్నది చూస్తాడు, దానికి తగ్గట్టుగా అనుగ్రహించడం జరుగుతుంది…

_*🌷శుభమస్తు🌷*_
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏