🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 25 – 11 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పంచమి* సా6.49 వరకు
నక్షత్రం : *ఉత్తరాషాఢ* రా9.00 వరకు
యోగం : *గండం* ఉ11.14 వరకు
కరణం : *బవ* ఉ6.22 వరకు
మరల *బాలువ* సా6.49 వరకు,
వర్జ్యం : *రా1.09 – 2.49*
దుర్ముహూర్తము : *ఉ8.26 – 9.10*
మరల *రా10.29 – 11.20*
అమృతకాలం : *మ2.14 – 3.55*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండం : *ఉ9.00 – 10.30*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : *6.13*
సూర్యాస్తమయం : *5.20*
*_నేటి మాట_*
*” రూపము గొప్పదా ? – నామము గొప్పదా” ??*
ఈరోజుల్లో ఇది చాలా మంది భక్తులకు ఒక విధమైన సందేహం!…
ఒకానొక సమయంలో, హనుమంతుని తల్లి కౌసల్య ఇంటికి వచ్చింది.
కౌసల్య, ” అమ్మా ఎవరు మీరు? అని అడిగిందట,
అమ్మా! నేనెవరో నీకు తెలియదా?
విశాలమైన సముద్రాన్ని అవలీలగా దాటిన హనుమంతుని తల్లిని, ‘అని ఆమె జవాబిచ్చింది.
మరి కొద్ది సేపటికి అగస్త్యుని తల్లి వచ్చింది.
‘ అమ్మా! మీరెవరని అడుగగా, ‘ మహా సముద్రాన్ని ఒక్క గుటకలోమ్రింగిన అగస్త్యుని తల్లిని నేను, ‘ అని సమాధాన మిచ్చిందట,
‘ కౌసల్య చాలా ఆనందించి, ‘ నా కుమారుడైన రాముని అనుగ్రహము వల్లనే కదా, మీ కుమారులు అంతటి ఘనకార్యములు సాధించగల్గారు, ‘ అన్నది.
అప్పుడు రాముడు వచ్చి, ‘ అమ్మా! ఇందులో నీ ఘనత, నా ఘనత ఏమీ లేదు.
వాళ్లు పవిత్ర హృదయంతో *రామ నామము* స్మరించడంచేతనే అంతటి ఘనత సాధించగల్గారు.
“రామ నామమే అన్నిటికీ మూలాధారము ‘ అని అన్నారట…
నామి( పేరుగల శరీరము)కంటే నామము గొప్పది.
రూపము అశాశ్వతము, కానీ నామము శాశ్వతము, అని చెప్పారు రాముడు.
ఇప్పుడు చాలా మంది సందేహం ఏమిటoటే రూపం చూసాము కదా, ఇంకా నామం తో పని ఏముంటుంది అని…
మన పూర్వీకులు, ఋషులు, మునులు అందరూ నామం తోనే రూపాన్ని దర్శించారు, అది మనం మరవకూడదు…
అందుకే నిరంతరం నామస్మరణ, జపం చేయడం చాలా శుభకరం.
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏