నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 16 – 11 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : పాడ్యమి రా1.09 వరకు,
నక్షత్రం : కృత్తిక రా9.17 వరకు,
యోగం : పరిఘము రా2.27 వరకు,
కరణం : బాలువ మ2.09 వరకు,
తదుపరి కౌలువ రా1.09 వరకు,

వర్జ్యం : ఉ9.58 – 11.28,
దుర్ముహూర్తము : ఉ6.09 – 7.38,
అమృతకాలం : రా7.01 – 8.32,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం : మ1.30 – 3.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.08,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి మాట_*

*శ్రీ గురునానక్*
సాధు సత్పురుషుడు శ్రీ గురునానక్…
గుణ సంకీర్తన, లీలా సంకీర్తన కంటె, నామ సంకీర్తన ప్రధానముగా ఉండే భజన గీతములను భగవంతుడు ఎక్కువగా ఇష్టపడతాడు,
మన దేశములో గాని, చుట్టు ప్రక్కల వున్న దేశములలోను, అటువంటి సామూహిక భజనలద్వారా, సత్య, ధర్మాలను బహుళ ప్రచార మును కలిగించిన సాధు పురుషులలో ( saints) గురునానక్ గారు, మొట్టమొదటి వారు…

ఆయన సత్యము, దయ, అనే సందేశమును, దైవం ఒక్కడే అనే సందేశమును వ్యాప్తి చేశాడు.
అతను ఎప్పుడూ దయామయుడైన భగవంతుని గురించే ఆలోచించే వాడు,
భగవన్నామ సంకీర్తనే , భగవంతునికి, మానవునికి, మధ్య గట్టి బంధమును ఏర్పరచ గలదని గురు నానక్ గారు భావించే వాడు,
గురు నానక్ అద్భుతాలు చేసే వ్యక్తి కాదు, కాని ఆయన జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి.

బ్రాహ్మణ తరములకు చెందిన ఒక ఉపాధ్యాయుని వద్ద, అటు తర్వాత ముస్లింల మౌల్వీ వద్ద విద్యను అభ్యసించాడు.
క్షత్రియ కులములో పుట్టి, ముస్లిం భూస్వామి వద్ద పనిచేశాడు.

ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనగానే ఒక ముస్లిం యువకుని, తోడు తీసుకుని, భక్తిగీతాలు పాడుతూ ప్రచారం చేసేవాడు.
ఎక్కువగా ముస్లిం దేశాలలో భక్తి, సత్యము, ప్రేమ దయ, నిజాయితీ తో కూడిన జీవనము గడపాలని, బోధించాడు.
అర్ధంలేని కర్మాచరణములను ఖండించాడు.

“భగవన్నామము అత్యంత నిగూఢమైన శక్తి గలదని” గురునానక్ బోధలలోని ముఖ్యాంశాలు…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏