🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 04 – 12 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిథి : తదియ మ12.21 వరకు,
నక్షత్రం : పూర్వాషాఢ సా5.11 వరకు,
యోగం : గండం మ2.38 వరకు,
కరణం : గరజి మ12.21 వరకు,
తదుపరి వణిజ రా12.05 వరకు,
వర్జ్యం : రా1.10 – 2.46,
దుర్ముహూర్తము : ఉ11.27 – 12.11,
అమృతకాలం : మ12.18 – 1.56,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండం : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 6.19,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి మాట_*
*”పాండవులకు శ్రీ క్రిష్ణ పరమాత్ముడు చేసిన బోధ”*
పాండవులరణ్యములో నుండగా కృష్ణుడొకప్పుడు వారిని చూచుటకు వెళ్ళాడు.
అప్పుడు ధర్మరాజు తనకు కలిగిన కష్టమును, వాటి మూలమున తమ మనసుకు కలిగిన ఆందోళన చెప్పి, ” కృష్ణా నీవు మాతో కొద్ది దినములుండుము, అట్లయిననేగాని మా చిత్తమునకు శాంతి కలుగదు” అని ప్రార్ధించాడు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వి, “బావా! నేనెక్కడున్ననూ మీతో ఉన్నట్లే అను కొనుము.
కష్ట సుఖములు మానవులకు కాక, మాకులకు వచ్చునా? అధైర్య పడకుము, నేనొక చీటీ ఇచ్చెదను.
నీ కెక్కువగా కష్టము కానీ బాధలు కానీ, సుఖములైనవికానీ, తటస్థించిన ప్పుడు దానిని చదువుకొనుము, అదియే మనశ్శాంతి నివ్వగలదు. ”
అని చెప్పి చీటీ వ్రాసి ఒక కవరు లోపెట్టి ఇచ్చి పోయెను.
ధర్మజుడు ఆ కవరును కన్నుల కద్దుకొని, దేవతార్చన పేటికలో నుంచుకొనెను.
*చీటిలో ఉన్న మాట ఒక్కటే- ” ఎల్లకాలము ఉండబోదు”* అని…
భరించలేని కష్టము లేవీ ఉండవు, ఆ మాట అను కుంటూ భరిస్తూ ఉంటాము,
వచ్చిన కష్టము కానీ, సుఖము కానీ, మరల పోవునదే కానీ స్థిరముగా నుండునవి కాదనీ దాని భావము.
_ఆ రెండింటి చేతను మనస్సు ను చెదర కొట్టుకో కూడదని కృష్ణుడు చేసిన బోధ._
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏