🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 06 – 12 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిథి : పంచమి ఉ10.48 వరకు,
నక్షత్రం : శ్రవణం సా4.40 వరకు,
యోగం : ధృవం ఉ10.56 వరకు,
కరణం : బాలువ ఉ10.48. వరకు,
తదుపరి కౌలువ రా10.06 వరకు,
వర్జ్యం : రా8.32 – 10.04,
దుర్ముహూర్తము : ఉ8.32 – 9.16,
మరల మ12.12 – 12.56,
అమృతకాలం : ఉ6.29 – 8.03,
మరల తె5.47 నుండి,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండం : మ3.00 – 4.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.20,
సూర్యాస్తమయం: 5.21,
*_నేటి మాట_*
*P – P – P*
“ప్రతి మనిషికి జీవితంలో – రెండు విషయాలు చాలా అవసరం”,
1, మంచి ఆరోగ్యం (ఆరోగ్య)
మరియు
2, ఆనందం (ఆనంద).
శరీరానికి ఆరోగ్యం మరియు ఆత్మకు ఆనందం…
ఈ రెండింటితో మనము ఎంత ఎత్తుకైనా ఎగరవచ్చు,
అలానే మనకు రెండు విషయాలు అవసరం, దాని కోసం మనము దేవుని దయను పొందాలి!!…
భగవంతుని అనుగ్రహం పొందడానికి, మనము పవిత్రమైన చర్యలో నిమగ్నమై ఉండాలి.
దానికోసం మూడు ‘P’లను గుర్తుంచుకోవాలి!!…
స్వచ్ఛత(purity),
సహనం(patience) &
పట్టుదల(perseverance)
” ఈ మూడింటితో మనము మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని పొందవచ్చు…”
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏