నేటి ప్రధాన వార్తలు..

నిర్మల్: 125ఏళ్ల తర్వాత తొలిసారి భూసర్వే-పొంగులేటి
జిల్లాల వారీగా భూ సర్వేలు నిర్వహిస్తున్నాం.

ప్రతి అంశానికి భూ సర్వేనే ప్రామాణికం..

ఏడాదిన్నరలో భూ సర్వే పూర్తి చేస్తాం
అన్ని రకాల భూముల సమగ్ర సర్వే-మంత్రి పొంగులేటి…

భూదార్‌తో భూములకు పూర్తి హక్కులు కల్పిస్తాం
తెలంగాణను భూవివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కఠిన చర్యలు.

రాష్ట్ర వ్యాప్తంగా 73 వేల పూరిళ్లు గుర్తించాం
రెండోవిడతలో 73 వేలమందికి ఇందిరమ్మ ఇళ్లు-పొంగులేటి.

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
సెన్సెక్స్ 472 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్ల లాభం..
..

అమెరికా బిగ్‌ మూవ్..యూకే నుంచి B-1 బాంబర్ల తరలింపు.

RAF ఫెయిర్‌ఫోర్డ్‌ నుంచి B-1, B-52 బాంబర్ల తరలింపు.

భద్రతా కారణాలతో B-1, B-52 బాంబర్లు వెనక్కిపంపిన US.

ఫెయిర్‌ఫోర్డ్‌ నుంచి అమెరికాకు B-1, B-52 బాంబర్లు.

ఫెయిర్‌ఫోర్డ్‌ నుంచి గతంలో ఇరాన్‌పై అమెరికా దాడులు.

ఇరాన్‌ స్థావరాలపై B-1, B-52 బాంబర్లతో దాడులు.

హర్మూజ్‌ దాడుల్లో B-1 బాంబర్లను ఉపయోగించిన అమెరికా.

ఢిల్లీ: నేడు జంతర్ మంతర్ దగ్గర NSUI ఆందోళన
ఓటు చోరీకి వ్యతిరేకంగా NSUI నిరసన ప్రదర్శన.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద AI వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం, రేర్ తెలంగాణ అనే సోషల్ మీడియా అకౌంట్ల మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ మరియు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్.

కాంగోలో ఘోర ప్రమాదం.

నదిలో ఢీకొన్న రెండు పడవలు, 30 మంది మృతి
పడవ ప్రమాదంలో పలువురు గల్లంతు
గల్లంతైన వారికోసం కొనసాగుతున్న గాలింపు.
అధికారుల వివరాల ప్రకారం.. పడవల్లో ఒకటి దేశంలోని వాయువ్య ప్రాంతంలోని ఉబాంగి నుంచి కాంగో రాజధాని కిన్షాసాకు ప్రయాణిస్తుండగా.. మరో పడవ కిన్షాసా నుంచి లుకోలెలాకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పడవలు ప్రమాదవశాత్తూ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నీట మునిగి 30 మంది చనిపోగా.. పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహయక చర్యలు చేపట్టారు.

నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణం ఏంటన్న తెలియరాలేదు. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి చమురు తీసుకు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ప్రమాదం తర్వాత చమురు మొత్తం నదిలో పడిపోవడంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

కొందరికి ఈత వచ్చినా కూడా భారీ పరిమాణంలో చమురు నీటిపై తెలుతుండటంతో తప్పించుకోవడం సాధ్యం కాలేదని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాంగోలో పడవ ప్రమాదం సాధారణంగా మారిపోయి.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

🔹కాంగ్రెస్‌ ఉద్యమ క్యాలెండర్..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన కాంగ్రెస్

అక్టోబర్ 10 నుంచి 20 వరకు బ్లాక్ స్థాయిలో “ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారం

సైకిల్, బైక్ యాత్రలు నిర్వహించనున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మల దహనం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కరపత్రాల పంపిణీ

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు బూత్ స్థాయిలో “ఓట్ బచావో – దేశ్ బచావో చౌపాల్” నిర్వహణ

చౌపాల్ కార్యక్రమాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 15 వరకు “వోట్ రక్షక్ అభియాన్”

నవంబర్ 25, 26 తేదీల్లో “చలో ఢిల్లీ” యాత్రలు నిర్వహించనున్న కాంగ్రెస్

ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ప్రారంభం కానున్న ఆరు యాత్రలు ప

ఆరు యాత్రలకు నాయకత్వం వహించనున్న కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి చేరుకోనున్న యాత్రలు