News updates…

పాక్‌ సైనికులపై దాడులకు మాదే బాధ్యత: BLA

పాక్‌ సైనికులపై దాడులకు మాదే బాధ్యత: BLA
పాక్‌ సైనికులపై దాడులు చేసింది తామేనని బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్‌ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే దాడులు చేసినట్లు పేర్కొంది. పాక్‌పై ఆరు దాడులు చేశామని, రిమోట్‌ కంట్రోల్‌ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామని తెలిపింది. పాక్‌ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేత, మొబైల్‌ టవర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

*పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి*

*మన యుద్ధ విమానాలకు ముప్పు తప్పించే లక్ష్యం*

పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలపై భారత్‌ గురిపెట్టింది. లాహోర్‌, రావల్పిండి, కరాచీ సహా ఏకంగా తొమ్మిది నగరాల్లోని పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై దాడులు చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ 9, ఎల్‌వై 80 వంటి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పాక్‌ వద్ద ఉన్నాయి. భారత యుద్ధ విమానాలు, క్షిపణులను అడ్డుకుని కూల్చివేయడం ఈ వ్యవస్థల లక్ష్యం. అందువల్ల భారత్‌ వ్యూహాత్మకంగా వీటిపై గురిపెట్టింది. సైనిక పరిభాషలో ఇటువంటి ఆపరేషన్లను ‘సియాడ్‌’ (సప్రెషన్‌ ఆఫ్‌ ఎనిమీ ఎయిర్‌ డిఫెన్సెస్‌) అంటారు. మన యుద్ధ విమానాలకు శత్రు ఎయిర్‌ డిఫెన్స్‌ నుంచి ముప్పు ఏర్పడినప్పుడు గానీ, లేదా శత్రు భూభాగంలో త్వరలో భారీ దాడులు చేయాలని భావించినప్పుడు గానీ ఈ సియాడ్‌ దాడులు చేస్తారు. భారత్‌ ఇంత పెద్దఎత్తున అనేక పాక్‌ నగరాల్లో సియాడ్‌ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్లో రాడార్లు ప్రధానమైనవి. ఇవి యుద్ధ విమానాలు, క్షిపణులపైకి రాడార్‌ సిగ్నల్స్‌ను పంపి వాటి ఆచూకీని కనిపెడతాయి. ఆ తర్వాత క్షిపణులు వెళ్లి వాటిని అడ్డుకుని ధ్వంసం చేస్తాయి. అయితే ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల నుంచి వెలువడే రాడార్‌ సిగ్నల్స్‌ ఎదుటి విమానాల్ని కనిపెట్టేందుకే కాదు, తమ ఆచూకీ ఎదుటివారు తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయి. ఇలా శత్రు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల నుంచి వెలువడే రాడార్‌ సిగ్నల్న్‌ను కనిపెట్టి దాడి చేసే రుద్రమ్‌, కేహెచ్‌-31పీ అనే క్షిపణులు భారత్‌ వద్ద ఉన్నాయి.

వీటిలో కేహెచ్‌-31పీ రష్యన్‌ది కాగా రుద్రమ్‌ క్షిపణి దేశీయంగా రూపొందించినది. వీటితోపాటు ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన హరోప్‌ కామికాజ్‌ డ్రోన్లను కూడా గురువారం నాటి దాడుల్లో ఉపయోగించారు. ఇవి రాడార్‌ సిగ్నల్స్‌ను కనిపెట్టి ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వద్దకు చేరుకోవడంతోపాటు దానిపై ఆకాశంలో ఎగురుతూ అకస్మాత్తుగా దాడి చేస్తాయి. భారత్‌ ఇలాంటి 25 పైగా డ్రోన్లను పాక్‌పైకి పంపినట్లు సమాచారం. వీటన్నింటినీ కూల్చివేసినట్టు పాక్‌ ప్రకటించినప్పటికీ లాహోర్‌లోని పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై ఈ డ్రోన్‌ దాడి చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. లాహోర్‌లో చేసిన దాడిలో లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు భారత రక్షణ శాఖ సైతం ఒక ప్రకటనలో వెల్లడించింది…

*దేశంలో 3 రోజుల పాటు ATMలు బంద్?.. కేంద్రం కీలక ప్రకటన*

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పోస్టు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని అందులోరాసుంది. ఈ పోస్టుపై PIB స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని ట్వీట్ చేసింది. ATMలు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.

భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. భారత్ ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులను భారత సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించింది. వాటిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా గాల్లోనే ధ్వంసం చేశాయి. అయితే ind pak వార్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశంలో పలు రైళ్లు, విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు ఎయిర్‌పోర్టులు సైతం మూసివేశారు.

*ఏటీఎంలు బంద్?*

ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని జోరుగా ఓ పోస్ట్ చక్కర్లు కొడుతుంది. అందులో ‘‘పాకిస్తాన్ యుద్ధం మధ్య రాన్సమ్‌వేర్ సైబర్ దాడి కారణంగా.. రాబోయే 2-3 రోజులు ATMలు మూసివేయబడతాయి. ఈరోజు ఎలాంటి ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేయవద్దు. దయచేసి ఫోన్‌లోని అన్ని కాంటాక్ట్ దారులకు ‘‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’’ అనే వీడియోను ఓపెన్ చేయొద్దని తెలియజేయండి.

*PIB ట్వీట్*

ఇది మీ మొబైల్‌ను ఫార్మాట్ చేసే వైరస్. జాగ్రత్త.. దయచేసి భారీ రాన్సమ్‌వేర్ దాడిని షేర్ చేయండి. అటాచ్‌మింట్‌లతో కూడిన ఏ ఇమెయిల్‌ను తెరవకండి.’’ అంటూ అందులో ఉంది.’’ ఈ పోస్టుపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని పేర్కొంది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. తప్పుడుగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్‌ను ఎవరూ నమ్మకండి అని తెలిపింది. ATMలు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.

ATM సేవలు అంతరాయం లేకుండా ఉంటాయని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న మెసేజ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఖచ్చితమైన వార్తల కోసం అధికారిక అకౌంట్స్ చూడాలని PIB ప్రజలకు సూచించింది..

*సైబర్ దాడులకు పాక్.. ఇంటెలిజెన్స్ కీలక హెచ్చరికలు*


దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్థాన్ నెక్స్ట్ స్టెప్.. భారత్ పై సైబర్ ఎటాక్కు దిగనుందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భారత ప్రజలకు కీలక సూచనలు చేసింది. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజెస్, లింక్స్ ఓపెన్ చేయవద్దని తెలిపింది. అలాగే తెలియని నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వచ్చినా సమాధానం ఇవ్వకూడదని స్పష్టం చేసింది..

ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చిన భారత ఆర్మీ…!

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌ ’కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.
యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లతో పాక్‌ మిలిటరీ పోస్ట్‌లను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్‌ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే ఏ సెక్టార్‌లోని పోస్ట్‌ను నేలకూల్చారన్నది మాత్రం తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చినట్లు తెలుస్తోంది..

*ఆరునెలలు కాల్పుల విరమణ…మావోయిస్టు పార్టీ సంచలన లేఖ*

మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్‌ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక లేఖను విడుదల చేశారు.

దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ భద్రతాదళాలు ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులను హతమార్చింది. అయితే మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్‌ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక లేఖను విడుదల చేశారు.

*మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖా సారాంశం..*

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్‌ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని “మా నుండి 6నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము.

*ప్రియమైన కామ్రెడ్స్‌, ప్రజలారా!*

గత కొంతకాలంగా మా పార్టీకి ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్‌ ను మొదట తెలుగు రాష్ర్టా్ల్లో ప్రారంభించారు. దానిలో భాగంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, పార్టీలు ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చర్చల విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీపీఐ కగార్‌ ఆపరేషన్‌ ను రద్దు చేసి శాంతి చర్చలు జరుపాలని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తుంది. ఈ కార్యక్రమాలలో మిగతా వామపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా తమ రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరుపాలని తీర్మానం చేసింది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్‌ ను చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రశేఖర్‌ రావు కూడా ఇదే డిమాండ్‌ ను ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత కూడా ఇదే డిమాండ్‌ ను చేశారు. ఇది హర్షించదగిన విషయం.

రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు, ప్రముఖులు ఇదే విషయం మీద ప్రచారం చేస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలు ఇదే డిమాండ్‌ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో, దేశంలోనూ ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు సానకూలతను కలిగించేందుకు మా నుండి కాల్పుల విమరణను ప్రకటించుచున్నాము..జగన్‌
అధికార ప్రతినిధి లేఖను విడుదల చేశారు.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..