NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ.60 వేల జీతం!.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యంగ్ ప్రొఫెషనల్ – లీగల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి నెలకు రూ.60,000 వేతనం అందించనుంది. మొత్తం 5 ఖాళీలను ప్రకటించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, నేషనల్ లా స్కూల్ లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. CLAT లేదా CLAT PG 2026 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు NHAI తెలిపింది.

ఖాళీల వివరాలు

మొత్తం 5 యంగ్ ప్రొఫెషనల్ లీగల్ పోస్టుల్లో 4 పోస్టులు అన్‌రిజర్వుడ్ కేటగిరీకి, ఒక పోస్టు BC కేటగిరీకి కేటాయించారు. SC, ST కేటగిరీలకు ప్రత్యేకంగా పోస్టులు లేవు. అయితే మొత్తం ఖాళీల్లో ఒక పోస్టు PwBD అభ్యర్థులకు రిజర్వ్ చేయనున్నారు.

అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అలాగే ప్రకటించిన ఖాళీల సంఖ్యను భవిష్యత్తులో పెంచే లేదా తగ్గించే అవకాశం ఉందని NHAI స్పష్టం చేసింది.