విశాఖలో ప్రత్యేక ఎన్ఐఏ (national investigation agency) కోర్టు ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రత్యేక NIA కోర్టును ఏర్పాటు చేస్తున్నన కేంద్రం..
విశాఖపట్నం, జైపూర్, పాట్నాలో కొత్త ప్రత్యేక కోర్టులు..
NIA దర్యాప్తు చేసిన ఉగ్రవాద కేసులను విచారించనున్న కోర్టులు..
ఉగ్రవాద కేసుల విచారణను వేగవంతం చేయడమే లక్ష్యం..
కేసుల సత్వర పరిష్కారం కోసం కేంద్రం కీలక నిర్ణయం,,
NIA చట్టం–2008లోని సెక్షన్ 11 ప్రకారం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు..
సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం..
విశాఖకు ప్రత్యేక NIA కోర్టు రావడంతో జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల విచారణకు మరింత ప్రాధాన్యత,,.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్తోపాటు రాజస్థాన్, బిహార్లలో కొత్తగా మూడు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఏపీలోని విశాఖపట్నం, రాజస్థాన్లోని జైపూర్, బిహార్లోని పట్నాలో ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేవలం ఎన్ఐఏ దర్యాప్తు చేసే కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేశారు.