వడ్ల డబ్బులు కట్ చేసుకున్న బ్యాంకు అధికారులు..

నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం చల్లగరిగెకు చెందిన గంగా జమున అనే మహిళా రైతు రూ.75 వేల పంట రుణం తీసుకోగా అది కాస్త రూ.1,06,265 అయింది.

సదరు మహిళ బ్యాంకు అకౌంట్లో వడ్లు అమ్మిన డబ్బులు జమ కాగా, బ్యాంకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రుణమాఫీ డబ్బులు రూ.1,06,265 కట్ చేసుకున్నారు.

తనకు చెప్పకుండా డబ్బులు ఎలా కట్ చేసుకుంటారని అడగగా.. తాము చేసేదేమీ లేదని, చేతులెత్తేసిన బ్యాంకు అధికారులు,, ఇక్కడ ఎక్కువ గలాటా చేయొద్దు అంటు దబాయించారు అంటు రైతు అవేదన వ్యక్తం చేశారు.

కష్టపడ్డ సొమ్మును రుణమాఫీ అయింది అనుకుంటే ,, అది పోకవడంతో లోన్ డబ్బుల కింద చెప్పకుండా తీసుకున్నారని మహిళా రైతు బోరున విలపించింది…