కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం..!.ఒక ఖాతాకు ఇక నలుగురు నామినీలు..!

బ్యాంకు వినియోగదారు తన ఖాతాకు నలుగురు నామినీలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది..దీంతో పాటు పలు కీలక ప్రతిపాదనలతో తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ చట్టాలు (సవరణ) బిల్లు-2024ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Niramala sitharaman) సభ ముందు ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

అలాగే, బ్యాంకుల్లో డైరెక్టర్‌షిప్‌ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని సైతం పెంచేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ మొత్తం ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉంది. ఇప్పుడున్న పరిమితి దాదాపు ఆరు దశాబ్దాల కింద నిర్దేశించారు. దాన్ని రూ.2 కోట్లకు పెంచారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ఇకపై డిపాజిటర్లు నలుగురి నామినీలను ఒకేసారి లేదా ఒకటి తర్వాత ఒకటి ఎంచుకునే అవకాశం కల్పి్స్తున్నట్లు తెలిపారు. లాకర్‌ సదుపాయం ఎంచుకున్న వారు మాత్రం ఒకరు తర్వాత ఒకరుగా నామినీలను ఎంచుకోవచ్చని చెప్పారు.

మహీంద్రా ఎలక్ట్రిక్‌పై కోర్టుకెక్కిన ఇండిగో.. కారణం ఏంటంటే?

2014 నుంచి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఆర్‌బీఐ బ్యాంకుల స్థిరత్వానికి కృషి చేస్తూ వస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బ్యాంకులు సురక్షితంగా, స్థిరంగా, ఆరోగ్యకరంగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీ కాలం సైతం 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచేందుకూ ఈ బిల్లు ప్రతిపాదిస్తోందని తెలిపారు. అలాగే, ఆడిటర్లకు చెల్లించే రెమ్యునరేషన్‌పై బ్యాంకులకు ఈ బిల్లు స్వేచ్ఛ కల్పిస్తోందన్నారు. ఈ బిల్లులోని సవరణలన్నీ బ్యాంకింగ్‌ రంగంలో పాలనా వ్యవహారాలను బలోపేతం చేస్తుందన్నారు. వినియోగదారుల సౌలభ్యం మెరుగవుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు..