రాష్ట్రములోనే హుజుర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినదుకు ప్రజలకు అభినందనలు .. ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజలు అహంకారాన్ని సహించరు*

*దేశంలోనే హుజూర్ నగర్ ను అభివృద్ధిలో ప్రత్యేక స్థానం*

*సర్పంచులు వార్డు సభ్యులు ఐక్యతతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి*

*గ్రామానికి 30 ఇందిరమ్మ ఇల్లు మంజూరు*

*ఓడిన గ్రామాల్లో నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి*

*సర్పంచులు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి*

సూర్యాపేట జిల్లా…

హుజుర్ నగర్ పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్లో నూతనంగా గెలిచినా సర్పంచ్ వార్డ్ నెంబర్ల సన్మానం కార్యక్రమంకి హాజర్ అయిన నీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు…

ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

ముందుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు…

మీరు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి…

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగదాలు ఉండకుండా చూడాలి..

మహాత్మ గాంధీ ముత్యాల బ్రాంచ్ ఎత్తిపోతుల పధకం ద్వారా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది..

జాన్ పహాడ్ లిఫ్ట్ ద్వారా పది వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది…

దేశంలోనే సన్న బియ్యం పథకం హుజుర్నగర్ లో ప్రారంభించడం నా అదృష్టం గా భావిస్తున్నా…

రాష్ట్రములో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..

మా ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ కార్డు మంజూరు చేసి 3.20లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాము…

పేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారు…

పేదలకు కొన్ని ఇండ్లను త్వరలో అందిస్తాము.మరి కొన్ని ఇండ్లు మరో ఆరు నెలలో అందిస్తాము..

మీ అందరి ఆధారాభిమానాలతో హుజుర్నగర్ నియోజకవర్గం ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా…

రాష్ట్రములోనే హుజుర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినదుకు ప్రజలకు అభినందనలు తెలిపారు..

దేశంలోనే హుజుర్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా నిలవాలని అన్నారు…

సర్పంచ్ ఎన్నికలు గతం కంటే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయని అన్నారు.. విపరీతంగా ప్రలోభాలకి కురికావడం తానున్న రోజుల్లో ప్రజాస్వామిక ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందిగా ఎదురయ్యేలా ఉందని అన్నారు ఈ పద్ధతి మారాలని పిలుపునిచ్చారు..

గ్రామాల్లో గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులు సేవకులుగా పనిచేసి గ్రామ ప్రజా ప్రజా సమస్యలను పెద్దదిక్కుగా ఉండి పరిష్కరించాలి..
తప్ప అహంకార భావనతో పని చేస్తే ప్రజలు దేనిని సహించిన అహంకారాన్ని మాత్రం సహించరని నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు..
అభివృద్ధి చేసిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై నాయకులు ఆత్మవంచన పరిశీలన చేసుకోవాలన్నారు గ్రామాల్లో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే కొన్ని గ్రామాలు ఓడిపోయామని మంత్రి హెచ్చరించారు నేను ఎమ్మెల్యేగా ఏడుపర్యాలు ఇక్కడ పోటీ చేసిన నాటి నుండి నేటి వరకు దేశంలోనే హుజూర్ నగర్ నుఅభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు ఆహార్నిశలు పాటుపడుతున్నానని ఆయన గుర్తు చేశారు నియోజకవర్గంలో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ప్రధానంగా లిఫ్టు నిర్మాణాలు ఐటిఐ డిగ్రీ కళా ఏటీసీ సెంటర్ వ్యవసాయ కళాశాల నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు నూతనంగా గెలుపొందిన గ్రామాల్లో 25 నుంచి 30 వరకు ఇందిర ఇండ్లకు ప్రతిపాదనలు పంపాలని సర్పంచులును కోరారు గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులు ఐక్యమత్తో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం రాష్ట్రంలో నెంబర్వన్ గా విజయవంతమైందని నాణ్యమైన సన్నబిర్యాన్ని అందిస్తూ అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఓడిపోయిన గ్రామాలపై ఆత్మ పరిశీలన చేసుకొని జరగబోయే ఎన్నికల్లో అలాంటి పరిణామాలకు తావివ్వకుండా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచులకు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సర్పంచులు వార్డు సభ్యులను శాలువాలు పూలమాలతో మంత్రిఉత్తమ్ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చక్కర వీరారెడ్డి మంజు నాయక్ నరాల కొండారెడ్డి త్రిపురం అంజన్ రెడ్డి కొనతం చిన్న వెంకటరెడ్డి ఎన్ వి సుబ్బారావు కాకునూరి భాస్కర్ రెడ్డి నాయకులు సాముల శివారెడ్డి ఈడుపుగంటి సుబ్బారావు ఎరగని నాగన్న గౌడ్ అరుణ్ కుమార్ దేశ్ముఖ్ దొంగరి వెంకటేశ్వర్లు తన్నీరు మల్లికార్జునరావు గెల్లి రవి దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మోతిలాల్ నాయక్ గోపాల్ నాయక్ బచ్చలకూరి బాబు నవీన్ నాయక్ ఒంటి పులి శ్రీనివాస్ భోగాల పిచ్చిరెడ్డి కుక్కల కరుణ నాగరాజు కర్నాటి శిరీష వీర నాగిరెడ్డి రాఘవులు ఎర్రగాని రాధా నాగరాజు మేడి సునీత రమణ గుండు రామాంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు..