ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..

మరోసారి వైసీపీపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు.. వైసీపీ నేతల్లో కొంతమంది అంటే గౌరవం ఉంది. కానీ, కొంతమంది పద్దతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా ఒళ్లు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తులు తాటతీస్తాం అంటూ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు…. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరినీ చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి జగన్‌ ఏం చేయలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదన్న పవన్.. గీత దాటి మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.