*కడుపు లో నులి పురుగులు పోవడానికి.
చాలా మంది కడుపులో నులి పురుగుల సమస్యతో ఇబ్బంది పడుతూంటారు. అసలు ఇవి మన కడుపులో ఉన్న సంగతి కూడా మనకు తెలీదు. ఈ సమస్య చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో నులి పురుగులు ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరసించిపోతారు. కలుషితమైన ఆహారం తినడం, నీళ్లు తాగడం, భోజనం చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల చేత కడుపులోకి నులి పరుగులు ఏర్పడతాయి. ఈ పురుగులు మన కడుపులో, ప్రేగుల్లో నివాసాన్ని ఏర్పరుచుకుని మనం తిసుకునే ఆహారం నుండి పోషకాలను గ్రహించి.. మనల్ని అనారోగ్య పాలు చేస్తుంది. చిన్నారుల్లో అయితే ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాల బారిన పడతారు..
1. వేప నూనె పది చుక్కలు చెక్కరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి
2. లేత వేప చిగురు గుప్పెడు పసుపు అర చెంచా ఉప్పు అర చెంచా కలిపి మాత్రలు చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకోవాలి వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.
3. పచ్చి బొప్పాయి కాయ నరక గా వచ్చిన పాలు 1చెంచా తీసి ఆముదం ఒక చెంచా కలిపి తాగాలి తాగిన కొద్ది సేపటికి విరోచనం ద్వారా పురుగులు పడి పోతాయి.
4. ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు.
మిరియాలు పొడి ఒక చెంచా
ఉప్పు ఒక చెంచా
ఈ పొడిని ప్రతిరోజు భోజనంలో ఒక పూట కలుపుకుని తినాలి,నులి పురుగులు నశిస్తాయి లేదా ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి….
సరిగ్గా ఉడికించని మాసం తినడం, మట్టిలో ఆడితే పాదాల ద్వారా పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తిస్తారు. కాళ్లకు చొప్పులు లేకుండా బాత్రూమ్ లకు వెళ్లడం ద్వారా, గాయ కూరలు, ఆకు కూరలు, పండ్లు వంటివి శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన కూడా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి.
కొన్ని లక్షణాలు బట్టి నులి పురుగులు ఉన్నాయో.. లేదో మనం గుర్తించవచ్చు. పోషకాహార లోపం, రక్త హీనత, కడుపులో నొప్పి, వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కనబడతాయి. కడుపులో నులి పురుగులను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఈ సమస్య తీవ్రతరమై.. ఆపరేషన్ వరకూ వెళ్లాల్సి వస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. నులి పురుగులను నివారించడానికి తేనె, వెల్లుల్లి, గుమ్మడి కాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్, పీచు పదార్థాలు, పుదీనా, కొబ్బరి వంటివి బాగా ఉపయోగపడతాయి..