నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఒక వైపు పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు.. మరో వైపు నిత్యవసరాలకు తోడుగా కూరగాయల ధరలు ఒక్క సారిగా పెరిగాయి..సమయంలోనే పెరుగుతున్న వంట నూనె ధరలు సామాన్యులకు సమస్య గా మారింది. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిఘా పూర్తి స్థాయిలో లేకపోవటం వినియోగదారులకు భారాన్ని పెంచుతోంది. నెల రోజుల కాలంలో పెరిగిన ధరలు మోయలేని భారంగా మారుతున్నాయి.
వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. ఒకే సారి లీటర్పై రూ. 30 వరకు పెరిగాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగింది. పలు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వంట నూనెల ధరలు పరిశీలిస్తే సన్ప్లవర్ ఆయిల్ రూ. 180 నుంచి రూ. 200, పామాయిల్ రూ. 120 నుంచి రూ. 145, వేరు శనగ నూనె రూ. 15 నుంచి రూ.20 కు చేరింది. 5 కిలోల డబ్బా రూ.1000 నుంచి రూ. 1150లకు, 15 కిలోల టిన్ను (‘హోల్సేల్) రూ. 2300 నుంచి రూ. 2400 వరకు పెరిగింది. అదే విధంగా రైస్ బ్రౌన్ నూనె ధర లీటర్ రూ. 150 నుంచి రూ. 165లకు పెరిగింది. వనస్పతి అయిల్ లీటరు రూ. 130 నుంచి రూ. 160, సోయాబీన్స్ ఆయిల్ రూ. 150 నుంచి రూ. 170కి చేరింది. ఆవ నూనే రూ .130 నుంచి రూ. 160కి చేరింది. వంట నూనేల ధరలు ఇలా పెరగటం సామాన్యులకు భారంగా భారింది. ఇప్పటికే పెరిగిన వంట గ్యాస్ ధరలు… రోజు రోజుకీ పెరుగుతున్న కూరగాయల ధరలతో వంట నూనెల ధరలు పెరగటం మరింత సమస్యగా మారుతోంది..