ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా కొనుగోలు చేసే వస్తువులకు ఆన్లైన్ పేమెంట్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు (Extra Fee For Cash On Delivery) ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది…దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ‘ఇలా చేయడం యూజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. దోపిడీ చేసే చీకటి విధానమే (Dark Patterns). దీనిపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించాం. అలాంటి ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.