వడ్లు కొనే దిక్కు లేక ఇబ్బంది పడుతున్న రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. ఒంటెద్దు నరసింహారెడ్డి..
*కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఒంటెద్దు నరసింహారెడ్డి* .
*ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు..*
*వడ్లు కొనే దిక్కు లేక ఇబ్బంది పడుతున్న రైతులు..*
*బిఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు..*
*సూర్యాపేట జిల్లా….*
నేరేడుచర్ల లొ brs పార్టీ కార్యాలయాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆద్వర్యంలో ప్రెస్ మీట్…..
*ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..*
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆరిగోశ పడుతుండ్రు…
అధికార కాంగ్రెస్ పార్టీగతంలోలో ఎన్నడు లేని విధంగా, ప్రశ్నిస్తే కేసులు పెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు..
వడ్లు కొనే దమ్ము లేని చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..
పాలన చేత కాకుండా హైడ్రా పేరుతో హైదరాబాద్ ఆడుతున్నారు,,.
కలెక్టరే స్వయంగా తనపై దాడి జరగలేదు అని చెప్తుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రమే దాడి జరిగిందంటూ ప్రచారాలు చేస్తూ అమాయక రైతులని అరెస్టు చేస్తున్న దారుణమైన ఘటన తెలంగాణలోనే జరుగుతున్నాయని అన్నారు..
సిఎం రేవంత్ రెడ్డి ఆరుగారింటి అమలు గాలికి వదిలేసి,, ఏడుగురు కుటుంబ సభ్యులకు 7 మంత్రి పదవులు ఇచ్చినట్లుగానే ఉంది..
తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోంది..
ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన తిరిగే పరిస్థితి లేదు..
రైతులని జైలు పాలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డికి ఆ ఘనత దక్కుతుంది..
ఎటువంటి సంబంధం లేని కేటీఆర్ పేరుని చార్జిషీట్లో చేర్చడంతోనే రేవంత్ రెడ్డికి భయం మొదలైందని అర్థం అయిపోతుంది..
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి పదవులతో ఎంజాయ్ చేస్తున్నారు,,, వడ్లు కొనే దిక్కు లేకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోకుండా మిల్లర్లతో కుమ్మక్కయ్యారు..
మిల్లర్లతో రహస్య ఒప్పందాలు చేసుకొని, అమాయక రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా మొత్తాన్ని మింగేస్తున్నారు..
రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి..
గతంలో బస్తాకి మూడు వేల రూపాయలు సంపాదించిన రైతు నేడు కనీసం 2000 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూడా అమ్ముకోవడమేనా.. పాలన చేతగాని ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ బెదిరిస్తుంది…
ఉద్యమ పార్టీకి కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు అన్నారు..
ఇప్పటికైనా పోలీసులు తమ ఉద్యోగం తాము చేస్తే మంచిదని,, అధికార పార్టీ చెప్పినట్టుగా బిఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెడితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు అన్నారు..
మార్కెట్ యార్డ్ లో రైతుల ఆవేదన..
నేరేడుచర్ల మార్కెట్ యార్డు వద్ద,, వడ్లు కొనుగోల ప్రక్రియను తెలుసుకునేందుకు వెళ్లిన బిఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి….
రైతులకి,, వ్యవసాయ అధికారులకు ఈ మధ్య వాగ్వాదం..
కనీసం ఒడ్లు ఆరబోసుకోవడానికి,
పట్టాలు కూడా ఇవ్వడం లేదని,,
పది రోజులుగా వడ్ల దగ్గరే కాపలా పడుకోవాల్సి వస్తుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ధాన్యపు రాసులు పరిశీలించిన అనంతరం ఒంటెద్దు నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..*
కుటుంబాలను వదులుకొని ధాన్యపు రాశుల వద్దే గడుపుతున్న రైతుల్ని చూసైనా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం రావడం లేదు…
గతంలో సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు వస్తా 2700 నుండి 3000 వరకు ధర వచ్చిందని., ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 నుండి 2200 మాత్రమే వస్తుందని, మహిళల రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు…
సుమారు పది నుండి 20 రోజులగా మార్కెట్ యార్డులో, ధాన్యం రాశులు పోసి, ఉన్నాగాని కనీసం స్థానికంగా ఉన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా,, పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకి తాగిస్తుందని అన్నారు..
మంత్రులు కమిషన్ మత్తులో మునిగి రైతుల్ని నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు..
రైతుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు..
రైతు భరోసా ఇస్తాను,, ఎటువంటి కొర్రెలు లేకుండా, 500 బోనస్ ఇస్తానని బోగస్ మాటలు చెప్పి నేడు రైతుల్ని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డికి ఇంకా సిగ్గు ఎప్పుడు వస్తుందోనని అన్నారు..
రైతులని జైల్లో పెట్టించిన వ్యక్తికి రైతులు గురించి ఏం తెలుస్తుందిలే అని ఎద్దేవా చేశారు…
చివరి గింజ కొనుగోలు చేసే వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని అన్నారు..
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కి వెళ్లి అక్కడ వడ్లు కొనుగోలు విషయం తెలుసుకునే తరుణంలో,, అధికార పార్టీ నేతలు కూడా, తమ ఆవేదనను ఒంటెద్దు నరసింహారెడ్డి గారికి చెప్పుకోవడం విశేషం..
ఒంటెద్దు నరసింహారెడ్డి మార్కెట్ యాడికి వచ్చారని తెలుసుకున్న రైతులు అక్కడికి రావడంతో వ్యవసాయ అధికారుల పనితీరుపై రైతులు ఆగ్రహించి, వ్యవసాయ అధికారులను ప్రశ్నించడంతో.. పది రోజులైనా కూడా, కళ్ళం పట్టాలు అందించని అధికారులు హుటా హుటేనా వెంటనే రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు..
దీంతో రైతులు ఒంటెద్దు నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.