పాక్‌కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్‌..

పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. వారిని అహ్మద్‌ హుస్సేన్‌, సాదిక్‌లుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం రామ్‌నగర్‌ పరిధిలోని బిడ్డీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి టొయోటా ఆటోమొబైల్‌(Toyota Automobile) కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ మార్చి 15న కంపెనీ నోటీసు బోర్డులో ఒక నోటీసు అతికించారు. ఈ నోటీసులో ఫ్యాక్టరీ లోపలున్న టాయిలెట్‌ గోడలపై పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదారుల రాయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానిలో హెచ్చరించారు.

ఈ ఉదంతంపై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కంపెనీలో ఏడాదిగా కంట్రాక్ట్‌పై పనిచేస్తున్న అహ్మద్‌ హుస్సేన్‌, సాదిక్‌ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించి, వారిని అరెస్ట్‌ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని తెలిపారు. రామ్‌నగర్‌ ఎస్సీ శ్రీవాస్తవ్‌ మాట్టాడుతూ ఒక ప్రవేట్‌ కంపెనీలో పాక్‌కు మద్దతుగా నినాదాలు రాసినవారిని పట్టుకున్నామని, సెక్షన్‌ 67 ప్రకారం వారిపై కేసు నమోదు చేశామన్నారు..