పీఏసీ సమావేశం రసాభాస…!..మీరు ఏ లెక్కన పీఏసీ ఛైర్మన్?. మీటింగ్‌లో గాంధీని నిలదీసిన బీఆర్ఎస్..

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన పీఏసీ సమావేశం రసాభాసగా మారింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా పీఏసీ సభ్యులైన వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ సమావేశంలో తమ నిరసనను తెలిపి, మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించారు….

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బుల్డోజర్ రాజకీయమే నడుస్తోందని సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. గాంధీని కాంగ్రెస్‌ సభుడిగా సీఎం బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. చేరికల విషయంలో కాంగ్రెస్‌ దాగుడు మూతలు ఆడుతోందని, గాంధీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మండలి సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందనీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం మనసు మార్చుకుని, కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలని ఆమె కోరారు.