పద్మశ్రీ దరిపల్లి రామయ్య ( వనజీవి రామయ్య) మరణం పట్ల…………..
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘వనజీవి రామయ్యగా సుపరిచితులైన దరిపల్లి రామయ్య ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు. ఖాళీ భూములు, రోడ్ల పక్కన, ప్రభుత్వ,ప్రైవేట్ స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా 2017లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన జీవిత కథ పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాల్లోనూ చేర్చారు..
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు……………
వనజీవి రామయ్య జీవితం ఎంతో మందికి మార్గదర్శనం.
కోటి మొక్కలు నాటిన ఆయన జీవితం ధన్యం…….
ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రకృతిని కాపాడుకుందాం………
అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసాన్ని ఎదుర్కొందాం అని ఈటల అన్నారు……..
వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు…
ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించారు..
వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు…..
తెలంగాణ, ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయింది………….
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్….
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.
“వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు.
మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని అన్నారు.
అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య గారు అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు.
శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు….