పహల్గామ్ ఉగ్రదాడి.. మరో వీడియో వైరల్

పహల్గామ్ ఉగ్రదాడి.. మరో వీడియో వైరల్

J&K పహల్గామ్ ఉగ్రదాడిని ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పటికే అందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకొచ్చాయి. తాజాగా మరో భయానక వీడియో వైరల్ అవుతోంది. ఓ టూరిస్ట్ రోప్ వేలో వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఉగ్రదాడి కూడా రికార్డు అయ్యింది. అతని చుట్టూ ఉన్న పర్యాటకులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఓ వ్యక్తి బుల్లెట్ తగిలి కిందపడిపోవడం, రోప్ వే చివరన మృతదేహం ఉండటాన్ని వీడియోలో చూడొచ్చు….

జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించే దేశ విదేశాలకు చెందిన ప్రకృతి ప్రేమికులు.. తప్పకుండా చూసే ప్రదేశం బైసరన్ లోయ. అక్కడి అద్భుత దృశ్యాలను చూసి.. వాటిని తమ కెమెరాల్లో బంధించుకునేందుకు పర్యాటకులు ఎగబడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఉగ్రదాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ తీసిన వీడియోలు.. ఇప్పుడు ఆ ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. బైసరన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు ఫోటోలు, వీడియోలు, రీల్స్ తీసే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు ఈ ఉగ్రదాడికి కీలక ఆధారాలుగా మారాయి. ఈ ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏకు ఈ వీడియో దొరికింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి సంబంధించిన కీలక ఆధారాలు కలిగిన అత్యంత కీలకమైన ఇప్పుడు ఎన్ఐఏ చేతికి వచ్చింది.