ఇండియన్ ఆర్మీ యూజ్లెస్” ..షాహిద్ అఫ్రీదీ ఓవర్ డైలాగ్స్…!

అడ్డూ అదుపూ లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ”ఇండియన్ ఆర్మీ యూజ్లెస్” అని భారత సైన్యంపై అవాకులుచవాకులు పేలాడు. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రను నిరూపించాలని డిమాండ్ చేశాడు.
ఇండియాలో ఒక క్రాకర్ పేలినా అందుకు కారణం పాకిస్తాన్ అని భారతీయులు నిందిస్తారని వాపోయాడు. కశ్మీర్లో 8 లక్షల సమర్థవంతమైన సైన్యం ఉందని భారత్ చెప్పుకుంటుందని, అయినప్పటికీ పహల్గాం ఘటన జరిగిందని షాహిద్ అఫ్రీదీ వ్యాఖ్యానించాడు. అంటే.. ఇండియన్ ఆర్మీ యూజ్లెస్ అనేగా దీని అర్థం అని వ్యాఖ్యానించిన అఫ్రీదీ.. దేశ ప్రజలకు కనీస రక్షణ కల్పించలేని స్థితిలో భారత సైన్యం ఉందని ఎద్దేవా చేశాడు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ సమా టీవీ ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రీదీ ఈ దురుసు వ్యాఖ్యలు చేశాడు.