పాక్-అఫ్గాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

పాక్-అఫ్గాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

రెండు దేశాల మధ్య ఘర్షణలను ఆపడం నాకు చాలా సులభం

దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపి లక్షలాది మంది జీవితాలను కాపాడటం నాకు ఇష్టం

ఇప్పటికే 8 యుద్ధాలను ఆపాను

పాక్-అఫ్గాన్ యుద్ధం ఆపితే మొత్తంగా నేను తొమ్మిది యుద్ధాలు ఆపినట్లు అవుతుంది. డొనాల్డ్ ట్రంప్.…

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తే, దానిని పరిష్కరించడం తనకు చాలా ‘సులభమైన’ పని అని పేర్కొన్నారు.

శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో లంఛ్ సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. “పాక్ దాడి చేసిందో లేదా అఫ్గాన్ నుంచి దాడి జరుగుతుందో నాకు అర్థమైంది. నేను గానీ దానిని పరిష్కరించాల్సి వస్తే, దాన్ని పరిష్కరించడం నాకు సులభం” అని వ్యాఖ్యానించారు.

లక్షలాది మంది ప్రాణాలు కాపాడాను!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు ఆపి లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. అదే విధంగా అఫ్గాన్, పాకిస్థాన్ వివాదాన్ని పరిష్కరించడంలో తాను విజయం సాధిస్తానని పేర్కొన్నారు.

“ప్రజలు చంపబడకుండా ఆపడం నాకు ఇష్టం. నేను ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. అదే విధంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను” అని ట్రంప్ అన్నారు..