పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..పెట్రోలియం లెవీ, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ జమాత్-ఇ -ఇస్లామీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్లలో ప్రధాన హైవేలు, రోడ్లపై ప్రదర్శనలు, సిట్-ఇన్లు, ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో ఆయా నగరాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం లెవీ, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ జమాత్- ఇ -ఇస్లామీ ఆధ్వర్యంలో శుక్రవారం పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్లలో ప్రధాన హైవేలు, రోడ్లపై ప్రదర్శనలు, సిట్-ఇన్లు, ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో ఆయా నగరాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిందని ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. ”ఇక చాలు, లెవీని వెనక్కి తీసుకోండి. ఉపశమనం కల్పించండి” అనే ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు.