భారత్ పైకి అణ్వాయుధాలు ప్రయోగిస్తాం: పాక్ మంత్రి..

భారత్ పైకి అణ్వాయుధాలు ప్రయోగిస్తాం: పాక్ మంత్రి

సింధు జలాలను పాకిస్థాన్కు రాకుండా అడ్డుకుంటే, భారత్తో యుద్ధం చేస్తామని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ సంచలన ప్రకటన చేశారు.

130 అణ్వాయుధాలను భారత్ వైపే గురి పెట్టామని వాటితో దాడి చేస్తామని హెచ్చరించారు.

పాక్ గగనతలం నుంచి భారత్ విమానాలపై నిషేధంతో 2 రోజుల్లోనే ఇబ్బందులు ఏర్పడ్డాయని, మరో పదిరోజులు పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడి విమానయాన సంస్థలు దివాళా తీస్తాయని జోస్యం చెప్పారు.