పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమంటూనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ భారత్‌పై నోరు పారేసుకున్నారు…1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రమాదకర మలుపు తీసుకొని ఉండేదన్నారు..భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ముజఫరాబాద్‌లో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. పహల్గాం ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు జరపాలని కోరినా భారత్ తిరస్కరించిందన్నారు…
పాక్ ప్రధాని పై విధంగా మాట్లాడ్డం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలానే ఆయన నోరు పారేసుకున్నారు. అంతు ముందు భారత్ శాంతి చర్చలకు రావాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. భారత్ తో చర్చలలో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ మళ్ళీ కాశ్మీర్ గురించి చర్చల చేయాలని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరాన్ని సందర్శించారు..