నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి కుమార్ పై వేటు…

నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి కుమార్ పై వేటు.

సూపరింటెండెంట్ పై తీవ్ర మైన అవినీతి ఆరోపణలు.

ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసిన ప్రభుత్వం

ఇంచార్జ్‌గా డాక్టర్ విజయ్ కుమార్ నియామకం.

నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేత

ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం

సూపరింటెండెంట్ సీఎంవో, మంత్రి పేర్లు ఉపయోగించడంపై సీరియస్..

తానెలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసిన కలెక్టర్

నిలోఫర్ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు తొలగించిన అధికారులు

ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశం పై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఆదేశించిన కలెక్టర్….

నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవి కుమార్ పై ఆరోగ్య మంత్రికి, వైద్య మరియు ఆరోగ్య డైరెక్టర్ కు బ్లడ్ బ్యాంకుల పరిపాలనా సమస్యలు, ఆసుపత్రిలో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు లేవనెత్తిన సమస్యలు మరియు పరిష్కారం కాని ఇతర సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేశారు…

నీలోఫర్ హాస్పిటల్ కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ విజయ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

నీలోఫర్ హాస్పిటల్ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి మరియు వైద్యుల వైద్య విద్య కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో అనుసంధానించబడి ఉంది…