సిందూర్పై ఫేక్న్యూస్తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్, ఇప్పుడు నిజం ఒప్పుకుంది. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన పాక్ పాలకులు, వాస్తవాన్ని అంగీకరించారు.. భారత్ చేసిన దాడుల రేంజ్ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రతపై షహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది..
పరేషన్ సిందూర్పై ఫేక్న్యూస్తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్, ఇప్పుడు నిజం ఒప్పుకుంది. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన పాక్ పాలకులు, వాస్తవాన్ని అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..’భారత్, పాకిస్తాన్లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు…..ప్రస్తుతం ప్రతిచోటా, పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఎలా స్పందించిందనే దాని గురించి చర్చ జరుగుతోంది. పాక్ సైన్యం పఠాన్కోట్, ఉధంపూర్, సహా అనేక ఇతర ప్రదేశాలపై దాడి చేసిందని మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు పాక్ ప్రధాని. శత్రువులు దాక్కోవడానికి చోటు కనుగొనలేకపోయారని షాబాజ్ షరీఫ్ అన్నారు. తనకు సెక్యూర్ ఫోన్ ద్వారా జనరల్ అసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి, భారత్కు తగిన సమాధానం ఇచ్చామని, ఇప్పుడు వారు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని తెలిపాడని షాబాజ్ అన్నారు. దీని కంటే పెద్దది ఏమి ఉంటుంది. శత్రువుకు గట్టి దెబ్బ ఇచ్చారు. ఇప్పుడు వాళ్లే కాల్పుల విరమణ చేయవలసి వచ్చింది. మీరు ఆలస్యం చేయకూడదని,యు కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించాలని సూచించినట్లు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాడు.